- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘జటాధర’ సినిమాలో విలన్‌గా సూపర్ స్టార్ మరదలు.. పవర్ ఫుల్ పోస్టర్ విడుదల
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు(Sudheer Babu), వెంకట్ కళ్యాణ్(Venkat Kalyan) కాంబోలో రాబోతున్న చిత్రం ‘జటాధర’(Jatadhara).

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో సుధీర్ బాబు(Sudheer Babu), వెంకట్ కళ్యాణ్(Venkat Kalyan) కాంబోలో రాబోతున్న చిత్రం ‘జటాధర’(Jatadhara). సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీగా రాబోతుండగా.. ప్రేరణా అరోరా, జీ స్టూడియోస్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్, శివిన్ నారంగ్, అరుణ్ అగర్వాల్, నిఖిల్ నందా ఇండియన్ సినిమాల్లో ఓ బెంచ్ మార్క్‌కు క్రియేట్ చేసేలా రూపొందిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా(Sonakshi Sinha) హీరోయిన్‌గా నటిస్తుండగా.. దివ్య ఖోస్లా ‘సితార’ పాత్రలో కనిపించనుంది. డివోషనల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ వస్తున్నాయి. చిత్రబృందం బాలీవుడ్ ముద్దుగుమ్మలను దింపుతూ ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ ఇస్తున్నారు. తాజాగా, ఈ చిత్రంలో సూపర్ స్టార్ మరదలు నటిస్తున్నట్లు ప్రకటిస్తూ.. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. మహేష్ బాబు మరదలు శిల్పా శిరోద్కర్ ‘జటాధర’లో శోభా పాత్రలో నటిస్తోంది. ఈ లుక్ ఇంటెన్స్, ఇంపాక్ట్‌ఫుల్‌కు హామీ ఇస్తుంది. గ్రాండ్ విజువల్స్, శక్తివంతమైన కథను అర్థమయ్యేలా చేస్తుంది. ఇక ఇందులో విలన్‌గా నటిస్తున్న శిల్పా బ్లాక్ కలర్ చీర, జడలో పువ్వులో పెట్టుకుని.. ఓ హోమం ముందు కూర్చొని నాలుక బయటకు పెట్టి పవర్ ఫుల్ లుక్‌లో కనపించింది.






