- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సూపర్‌స్టార్ మహేష్ బాబు-మెగాస్టార్ చిరంజీవి కాంబోలో మిస్సైన చిత్రాలివే..?
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ప్రముఖ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. వీరు ఇప్పటివరకు నటించిన సినిమాలన్నీ దాదాపు చాలా వరకు బ్లాక్ బస్టర్ హిట్లనే చెప్పుకోవచ్చు. అయితే టాలీవుడ్‌లో దర్శక, నిర్మాతలు ఇద్దరి స్టార్ హీరోల కలయికలో ఎన్నో సినిమాలు తెరకెక్కించిన.. ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే. అయితే నిర్మాత సుబ్బిరామిరెడ్డి(Produced by Subbirami Reddy) మెగా హీరోలైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Power Star Pawan Kalyan), మెగాస్టార్ చిరంజీవి కాంబోలో మూవీ తీయాలని అనుకున్నారట. కానీ వీలవ్వకపోవడంతో పవర్ స్టార్ ప్లేస్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబును ఎంపిక చేయాలనుకున్నారట.
ఇక ఈసినిమా చేసే బాధ్యత కూడా మాటల మాత్రికుడు త్రివిక్రమ్(Trivikram) కు అప్పజెప్పారట. కానీ స్టోరీ విషయంలో.. అలాగే అంత పెద్ద స్టార్స్ సినిమా అంటే ఓ రేంజ్‌లో ఉండాలని.. అందుకోసం చాలా బ్యాగ్రౌండ్ వర్క్ చేయాలని.. ఇందుకు ఎక్కువ టైమ్ తీసుకుంటుందని ఆలోచన చేశారట. తర్వాత చేద్దామని పక్కన పెట్టేసరికి చిరు-మహేష్ కాంబో మూవీ మరుగున పడిపోయిందట. ఈ సినిమానే కాదు.. కొరటాల శివ దర్శకత్వం(Directed Koratala Siva)లో కూడా ఓ మూవీ మిస్ అయ్యింది. ఆచార్య(Acharya) మూవీలో రామ్ చరణ్ పాత్ర కోసం ఫస్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబును తీసుకుందామని అనుకున్నారట. కానీ పలు కారణాల వల్ల ఈ చిత్రం కూడా మిస్ అయిందట. ఇకపోతే ప్రస్తుతం మహేష్ బాబు.. రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో భారీ ప్రాజెక్టులో నటిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర(Vishwambhara) మూవీలో నటిస్తున్నారు.