‘నాగబంధం’ సినిమా టీజర్ లాంచ్ చేయబోతున్న సూపర్ స్టార్..

by Mallepaka Hamsa |   (  Updated:2026-02-12 11:21:43  IST  )

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మరో మైథలాజికల్ వండర్ సిద్ధమవుతోంది.

‘నాగబంధం’ సినిమా టీజర్ లాంచ్ చేయబోతున్న సూపర్ స్టార్..
X

దిశ, సినిమా: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మరో మైథలాజికల్ వండర్ సిద్ధమవుతోంది. అభిషేక్ నామా(Abhishek Nama) దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘నాగబంధం’ (Nagabandham). ఆధ్యాత్మికత, నిగూఢ రహస్యాలు, అడ్వెంచర్ కలబోతగా రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కథాంశం చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. కేరళలోని ప్రసిద్ధ శ్రీ పద్మనాభస్వామి ఆలయం, ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయాల్లోని రహస్య నిధులు, వాటిని రక్షించే ‘నాగబంధం’ అనే ఆధ్యాత్మిక శక్తుల చుట్టూ తిరుగుతుంది. వాస్తవ సంఘటనలకు కల్పిత కథను జోడించి, విజువల్ వండర్‌గా ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, నిక్ స్టూడియోస్ బ్యానర్లపై కిషోర్ అన్నపురెడ్డి నిర్మిస్తున్నారు.

ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా మేకర్స్ ఒక క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని, ఫిబ్రవరి 15వ తేదీ ఉదయం 11:11 గంటలకు ఈ సినిమా టీజర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు లాంచ్ చేయనున్నారు. మహేష్ బాబు ఈ టీజర్‌ను విడుదల చేస్తుండటంతో, సినిమాపై అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ఈ పాన్ ఇండియా చిత్రంలో విరాట్ కర్ణ హీరోగా నటిస్తుండగా.. నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరితో పాటు భూమిక, మురళీ శర్మ, జగపతి బాబు వంటి సీనియర్ నటులు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా రేంజ్‌లో సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Next Story