- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒకేసారి 14 సినిమాలు.. అందుకే టార్గెట్ అయ్యా.. హీరో సంచలనం
కాజోల్, ట్వింకిల్ ఖన్నా హోస్ట్ చేస్తున్న ‘టు మచ్’ షో దూసుకుపోతుంది. ముఖ్యంగా సీనియర్ నటుల లైఫ్ స్టైల్, సక్సెస్ సీక్రెట్స్ గురించి పంచుకోవడంతో మంచి వ్యూయర్‌షిప్ లభిస్తోంది. ఇక తాజా ఎపిసోడ్‌లో ఒకప్పుడు బాలీవుడ్‌ను ఏలిన సూపర్ స్టార్

దిశ, వెబ్ డెస్క్ : కాజోల్, ట్వింకిల్ ఖన్నా హోస్ట్ చేస్తున్న ‘టు మచ్’ షో దూసుకుపోతుంది. ముఖ్యంగా సీనియర్ నటుల లైఫ్ స్టైల్, సక్సెస్ సీక్రెట్స్ గురించి పంచుకోవడంతో మంచి వ్యూయర్‌షిప్ లభిస్తోంది. ఇక తాజా ఎపిసోడ్‌లో ఒకప్పుడు బాలీవుడ్‌ను ఏలిన సూపర్ స్టార్ గోవింద తన స్నేహితుడు చంకీ పాండేతో కలిసి షోకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా షూటింగ్‌కు లేట్‌గా వస్తాడన్న ముద్రపడిన విషయంపై తెలివైన సమాధానమిచ్చాడు.
‘నేను టైమ్‌కు సెట్స్‌కు రాకపోవడంతో అపఖ్యాతిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఐదు షిఫ్టులు చేసి.. సకాలంలో వచ్చేందుకు ప్రయత్నించినా.. అది సాధ్యం కాలేదు. అందుకే టార్గెట్ అయ్యా. ఇన్ని సినిమాలతో ఒక మనిషి ఎంత బర్న్ అవుతాడు? నిజానికి నటులు ఒక్క సినిమాతోనే అలసిపోతారు’ అని చెప్పాడు. ఇక తనతో నటించిన హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా.. ‘గోవింద ఒకేసారి పద్నాలుగు సినిమాలు చేసేవాడు. ఒక సెట్ నుంచి మరో సెట్‌లోకి వెళ్లేందుకు టైమ్ పట్టేది. కొన్నిసార్లు మరో కాస్ట్యూమ్‌తో సినిమా సెట్‌లోకి వచ్చేవాడు’ అని చెప్పింది.






