- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డిఫరెంట్ కాన్సెప్ట్, మ్యాజికల్ రియలిజమ్.. ఓటీటీలోకి రాబోతున్నథ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
గత కొద్ది కాలంగా ఓటీటీ ట్రెండ్ కొనసాగుతోంది. నిత్యం ఏదో ఒక సినిమా స్ట్రీమింగ్ అందుబాటులోకి వస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

దిశ, సినిమా: గత కొద్ది కాలంగా ఓటీటీ ట్రెండ్ కొనసాగుతోంది. నిత్యం ఏదో ఒక సినిమా స్ట్రీమింగ్ అందుబాటులోకి వస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయినప్పటికీ నెలరోజుల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్నాయి. తాజాగా, ఓ తమిళ సూపర్ హిట్ థ్రిల్లర్ ఓటీటీలోకి రాబోతున్నట్లు ప్రముఖ సంస్థ అధికారికంగా ప్రకటించింది. లేటెస్ట్ తమిళ బ్లాక్ బస్టర్ ‘బాంబ్’ (Bomb)అక్టోబర్ 10 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
ఒకేసారి ఏకంగా మూడు ఫ్లాట్ ఫ్లామ్స్, ఆహా, సింప్లీ సౌత్, షార్ట్ ఫ్లిక్స్ వంటి వాటిల్లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సినిమా కమ్మైపట్టి, కాలపట్టి అనే రెండు గ్రామాలుగా కాలకమ్మైపట్టి అనే గ్రామం రెండు భాగాలుగా విడిపోతుంది. ఇక దేవుడిని నమ్మని కతిరావన్ సడెన్‌గా చనిపోతాడు. దీంతో అతన్ని రెండు గ్రామాల మధ్య కుర్చీ వేసి కూర్చొబెడతారు. కానీ ఆయన ఫ్రెండ్ మణి ముత్తు మాత్రం తన ఫ్రెండ్ కతి రావన్ చనిపోలేదని నమ్ముతాడు. కానీ ఒక రోజు శవాన్ని రెడీ చేస్తున్న సమయంలో పిత్తుల సౌండ్ రావడంతో కతిరావన్ దేవుడని నమ్ముతాడు.
ఆ తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈక్రమంలోనే.. రెండు గ్రామాలు మాకంటే మాకని గొడవలు పడుతుండగా.. కతిరావన్ బాడీ కనిపించకుండా పోతుంది. ఆ గ్రామంలో గొడవలు తీవ్రతరం అవుతాయి? ఆ తర్వాత ఏం జరిగింది.. కతిరావన్ మళ్లీ వచ్చాడా లేదా ? అనేది స్టోరీ. కాగా, ఈ సినిమాలో అర్జున్ దాస్, శివాత్మిక రాజశేఖర్(Shivathmika Rajasekhar) జంటగా నటించారు. ఈ థ్రిల్లర్ మూవీని విశాల్ వెంకట్(Vishal Venkat) తెరకెక్కించగా.. సుధా సుకుమార్, సుకుమార్ బాలక్రిష్ణన్ నిర్మించారు. సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు రాబోతుంది.






