మెగా ఫ్యాన్స్‌కు సూపర్ గుడ్ న్యూస్.. RC-16 రిలీజ్ అయ్యేది ఆ పండుగకే.. ట్వీట్ వైరల్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-03-06 12:30:38  IST  )

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) రీసెంట్‌గా ‘గేమ్ ఛేంజర్’(Game Changer) సినిమాతో మన ముందుకు వచ్చి భారీ డిజాస్టర్ అందుకున్నాడు.

మెగా ఫ్యాన్స్‌కు సూపర్ గుడ్ న్యూస్.. RC-16 రిలీజ్ అయ్యేది ఆ పండుగకే.. ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) రీసెంట్‌గా ‘గేమ్ ఛేంజర్’(Game Changer) సినిమాతో మన ముందుకు వచ్చి భారీ డిజాస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆర్ సీ-16’(RC-16). ‘ఉప్పెన’(Uppena Movie) ఫేమ్ బుచ్చిబాబు సనా(Buchi Babu Sana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ, అతిలోక సుందరి శ్రీదేవి(Sridevi) తనయురాలు జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక ఈ చిత్రానికి ఆర్ రెహమాన్(AR Rahman) సంగీతం అందిస్తున్నాడు.

ఇక ఇందులో స్టార్ యాక్టర్ జగపతి బాబు(Jagapathi Babu), శివరాజ్ కుమార్(Shivaraj Kumar) అలియాస్ శివన్న, దివ్వేంద్(Devend) వంటి ప్రముఖులు కీ రోల్ ప్లే చేస్తున్నారు. అయితే ఈ సినిమాను భారీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్(Mythri Movie Makers Banner) పై నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాగా.. ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో తాజాగా ఆర్-16 మూవీకి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..

వైరల్ అవుతున్న పోస్ట్ ప్రకారం.. ‘అనుకున్న దానికంటే ఆర్ సి-16 శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అదనంగా, తారాగణం, సిబ్బంది, సాంకేతిక నిపుణులు మరియు మిగతా వారందరి తేదీలు షెడ్యూల్ ప్రకారం ట్రాక్‌లో ఉన్నాయి. రామ్ చరణ్ ఈ సినిమాని ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలనుకున్నారు. ఇందులో భాగంగా దీపావళికి ఆర్ సీ -16 విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సాధ్యమైనంత వరకు ఈ పండుగకే రిలీజ్ చేయనున్నారు’ అనే ఓ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇక దీన్ని చూసిన మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మరి దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

Next Story