- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఎల్లమ్మ’ కోసం సూపర్ ఎగ్జైటింగ్‌గా ఉన్నానంటూ దేవిశ్రీ ప్రసాద్ ఆసక్తికర కామెంట్స్
సంగీత దర్శకుడిగా నా కెరీర్ 'దేవి' అనే సినిమాతో మొదలైంది. అంటే ఒక దేవత పేరుతో నా ప్రయాణం స్టార్ట్ అయ్యింది.

దిశ, సినిమా: ఇన్నేళ్లుగా తన మాస్ బీట్స్‌తో థియేటర్లను దద్దరిల్లజేసిన రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్(Devi Sri Prasad), ఇప్పుడు హీరోగా మన ముందుకు వస్తున్నారు. ‘బలగం’ చిత్రంతో సంచలనం సృష్టించిన దర్శకుడు వేణు యెల్దండి(Venu Yeldandi) తెరకెక్కిస్తున్న ‘ఎల్లమ్మ’(yellamma)తో బిగ్ స్క్రీన్‌పై దేవి శ్రీ ఎంట్రీ కాబోతున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌లో ‘పర్ష’ అనే పవర్‌ఫుల్ పాత్రలో దేవిశ్రీ లుక్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇదిలా ఉంటే..తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దేవిశ్రీ, ఈ సినిమా తనకు దక్కిన తీరును వివరిస్తూ ఒక అద్భుతమైన సెంటిమెంట్ గురించి చెప్పారు. ‘‘సంగీత దర్శకుడిగా నా కెరీర్ 'దేవి' అనే సినిమాతో మొదలైంది. అంటే ఒక దేవత పేరుతో నా ప్రయాణం స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు నటుడిగా నా తొలి చిత్రం ‘ఎల్లమ్మ’.
ఇది కూడా దేవత పేరే. ఒక నెల లోపే అంతా చకచకా జరిగిపోయింది. ఇదంతా దైవ నిర్ణయంగా భావిస్తున్నాను. నేను నిజంగా ‘ఎల్లమ్మ’ సినిమా కోసం సూపర్ ఎగ్జైటింగ్‌గా ఉన్నాను’’ అని దేవిశ్రీ ఎమోషనల్ అయ్యారు. దేవిశ్రీకి హీరోగా గతంలో ఎన్నో ఆఫర్లు వచ్చినా ఆయన తిరస్కరించారట. కానీ ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణం దిల్ రాజు ఇచ్చిన భరోసా అని తెలుపుతూ. ‘‘నెలకు కేవలం 10 రోజులు కాల్షీట్లు ఇస్తే చాలు, మీ సంగీత వృత్తికి ఎలాంటి ఆటంకం కలగకుండా షెడ్యూల్స్ ప్లాన్ చేస్తాం’’ అని దిల్ రాజు మాటివ్వడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని అన్నారు. హీరోగా మారుతున్నప్పటికీ తన మొదటి ప్రాధాన్యత ఎప్పుడూ సంగీతానికే అని దేవిశ్రీ స్పష్టం చేశారు. ‘‘ఎల్లమ్మ కూడా ఒక సంగీత ప్రాధాన్యత ఉన్న కథే. నా సంగీతాన్ని ఇష్టపడే వారందరికీ ఈ సినిమా ఒక గొప్ప నివాళిలా ఉంటుంది. మ్యూజిక్ ఎప్పటికీ నా జీవితం.’’ అని దేవిశ్రీ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.






