- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీక్రెట్స్ అన్నీ భయటపెట్టిన సందీప్ కిషన్.. ఆరు నెలలకోసారి అలా చేయాల్సిందేనంటూ పోస్ట్
సందీప్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన సీక్రెట్స్ అన్నీ బయటపెట్టేశారు.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో సందీప్ కిషన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో మనందరికీ తెలిసిందే. కేవలం సినిమాల గురించే కాకుండా, అప్పుడప్పుడు తన అభిమానులతో చిట్ చాట్ చేస్తూ పర్సనల్ లైఫ్ విషయాలను కూడా షేర్ చేసుకుంటుంటారు. తాజాగా, ఒక అభిమాని అడిగిన ఆసక్తికరమైన ప్రశ్నకు సందీప్ ఇచ్చిన రిప్లై ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. సందీప్ కిషన్ హెయిర్ స్టైల్ అంటే కుర్రాళ్లలో మంచి క్రేజ్ ఉంది. దీంతో ఒక అభిమాని తన జుట్టును పొడవుగా, ఆరోగ్యంగా పెంచుకోవడానికి ఏవైనా చిట్కాలు చెప్పమని అడగ్గా.. సందీప్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన సీక్రెట్స్ అన్నీ బయటపెట్టేశారు. కేవలం పైపైన పూతలే కాకుండా, లోపలి నుండి జుట్టు దృఢంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు.
సులభంగా అరిగే శుభ్రమైన ఆహారం తీసుకోవాలని, ముఖ్యంగా చక్కెర,నూనెలో బాగా వేయించిన పదార్థాలను పూర్తిగా మానేయాలని సూచించారు. ప్రతిరోజూ కొంచెం పెరుగు తినడం జుట్టుకు చాలా మంచిదని చెప్పారు. జుట్టు ఆరోగ్యానికి కూడా వ్యాయామం అవసరమట. ఖాళీ కడుపుతో కార్డియో చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుందని తెలిపారు. కొబ్బరి నూనెతో పాటు ఇంట్లోనే ఉల్లిపాయలు, కరివేపాకు, రోజ్మేరీ ఆయిల్ వంటి వాటితో తయారు చేసిన నూనెను వాడాలని సలహా ఇచ్చారు. ఉదయం పూట ‘సూపర్ సీడ్ మిక్స్’ (గింజల మిశ్రమం) తీసుకోవడం వల్ల జుట్టుకు కావాల్సిన పోషకాలు అందుతాయని అన్నారు.జుట్టు కడగడానికి వాడే నీరు శుభ్రంగా ఉండాలని, బయటకు వెళ్ళినప్పుడు జుట్టుకు దుమ్ము పట్టకుండా జాగ్రత్త పడాలని సూచించారు.
అన్నింటికన్నా ముఖ్యంగా జుట్టును ప్రేమగా చూసుకోవాలని, ప్రతి 6 నెలలకోసారి డాక్టర్‌ను సంప్రదించి సలహాలు తీసుకోవడం మంచిదని సందీప్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. కాగా.. సందీప్ కిషన్ సినిమాల విషయానికొస్తే.. సందీప్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సిగ్మా’. ఈ సినిమాతో దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తుండగా.. రాజు సుందరం, అన్బు థాసన్, యోగ్ జపీ, సంపత్ రాజ్, కిరణ్ కొండ, మహాలక్ష్మీ సుదర్శన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకులను అలరించనుంది.






