Sandeep Kishan: జాక్ పాట్ కొట్టిన సందీప్ కిషన్.. కోలీవుడ్ స్టార్ హీరో సినిమాలో చాన్స్!

by Mallepaka Hamsa |

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్(Sandeep Kishan) తెలుగులో పలు చిత్రాలు చేసినప్పటికీ హిట్ అందుకోలేపోయాడు.

Sandeep Kishan: జాక్ పాట్ కొట్టిన  సందీప్ కిషన్.. కోలీవుడ్ స్టార్ హీరో సినిమాలో చాన్స్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్(Sandeep Kishan) తెలుగులో పలు చిత్రాలు చేసినప్పటికీ హిట్ అందుకోలేపోయాడు. ఈ ఏడాది ‘ఊరు పేరు భైరవ కోన’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటిక్ టాక్‌ను సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆయన తమిళ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టి ఏకంగా స్టార్ హీరో ధనుష్‌తో ‘కెప్టెన్ మిల్లర్(Captain Miller), రాయన్’(Raayan) వంటి సినిమాలు చేశాడు. ఈ రెండు మూవీస్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అదే ఫామ్‌తో దూసుకుపోతున్నాడు.

ఇటీవల దళపతి విజయ్ (Thalapathy Vijay)కొడుకు జాసన్ సంజయ్(Jason Sanjay) దర్శకుడిగా పరిచయం అవుతున్న మొదటి సినిమాలో హీరోగా చాన్స్ అందుకున్నాడు. తాజాగా, సందీప్ కిషన్ జాక్ పాట్ కొట్టినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఓ స్టార్ హీరో మూవీలో అవకాశం అందుకున్నట్లు టాక్. లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj), సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) కాంబోలో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘కూలీ’. అయితే ఈ చిత్రాన్ని మలుపు తిప్పే పాత్రలో సందీప్ కిషన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. లోకేష్ కనగరాజ్‌తో ఉన్న బాండింగ్‌తో ఆయన ఈ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది.

Next Story