ఇంటర్వ్యూలో ప్రశ్నలు.. యాంకర్ సుమ పరువు తీసిన హీరో!

by Anjali |
ఇంటర్వ్యూలో ప్రశ్నలు.. యాంకర్ సుమ పరువు తీసిన హీరో!
X

దిశ, వెబ్‌డెస్క్: అద్భుతమైన ప్రేమ కథతో తెరకెక్కిన ‘సప్త సాగరాలు దాటి’ సినిమా సెప్టెంబరులో విడుదలై.. ప్రేక్షకుల ఆదరణ పొందింది. అయితే రీసెంట్‌గా ఈ చిత్రంలోని హీరో రక్షిత్, హీరోయిన్ రుక్మిణి స్టార్ యాంకర్ సుమకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో హీరో సుమపై పంచుల వర్షం కురిపించారు. ‘‘సప్తసాగరాలు దాటి సైడ్‌ ఎ, సైడ్‌ బి కథలు ముందే రాసుకున్నారా? అని సుమ రక్షిత్‌ను అడగ్గా.. కథ రాసింది నేను కాదు, హేమంత్‌ అన్నాడు. (నవ్వుతూ) రెండు పార్ట్స్‌ను కలిపి ఒకే సినిమాగా తీద్దామా? అని ఓ రోజు హేమంత్‌ అడిగాడు. రెండు భాగాలుగా తీస్తే బాగుంటుందని చెప్పాను.

అలా సైడ్‌ ఎ, సైడ్‌ బిగా తీశామన్నాడు. మరి దీనికి నిర్మాత ఒప్పుకున్నాడా? అని ప్రశ్నించగా.. నేనే నిర్మాతను అని పంచ్‌ వేశాడు హీరో. నాలుక్కరుచుకున్న సుమ మీరే హీరో, డైరెక్టర్‌, నిర్మాత, సింగర్‌ అని వర్ణించుకుంటూ పోవడంతో రక్షిత్‌.. తాను సింగర్‌ కాదని అన్నాడు. ఈ ఇంటర్వ్యూ చూసిన నెటిజన్లు.. ఏంటి సుమ.. ఎంతో అనుభవం ఉన్నదానివి, ఇలా చేశావేంటి? ముందే ప్రిపేర్‌ అవ్వాల్సింది. అనవసరంగా వారి ముందు పరువు తీసుకున్నావ్‌ కదా? అటు సినిమా గురించి ఇటు హీరో గురించి గురించి పూర్తిగా తెలుసుకోకుండానే ఇంటర్వ్యూ చేశావు’’. అంటూ కామెంట్లు పెడుతున్నారు

Advertisement

Next Story

Most Viewed