ఆ సినిమా విషయంలో నేను పెద్ద తప్పు చేశాను: వైరల్ అవుతున్న Sukumar కామెంట్స్

by Disha Web Desk 10 |
ఆ సినిమా విషయంలో నేను పెద్ద తప్పు చేశాను: వైరల్ అవుతున్న Sukumar కామెంట్స్
X

దిశ,వెబ్ డెస్క్: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో డైరెక్టర్ సుకుమార్ కూడా ఒకరు. పుష్ప సినిమాతో ఇండస్ట్రీ కొట్టిన సుకుమార్ ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ పనుల్లో చాలా బిజీగా ఉన్నారు . ఈ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ మధ్యకాలం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సుకుమార్ మాట్లాడుతూ తన సినీ కెరియర్లో చేసిన మిస్టేక్స్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు చెప్పాడు.. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

సుకుమార్ దర్శకత్వం వహించిన సినిమాలలో జగడం మూవీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా విషయంలో తాను పెద్ద తప్పు చేశానని తెలిపారు. "ఆర్య సినిమా సక్సెస్ అయిన తర్వాత దిల్ రాజు గారికి జగడం సినిమా కథ వినిపించాను అయితే ఆయన ఈ సినిమా విషయంలో నన్ను తప్పు పట్టడం నాకు నచ్చలేదు.. నేను వెంటనే రామ్ దగ్గరికి వెళ్లి ఈ సినిమా కథను చెప్పి రాత్రికి రాత్రే ముహూర్తం ఫిక్స్ చేసి తర్వాత రోజు పూజ కార్యక్రమాలను ప్రారంభించాము. ఈ కార్యక్రమానికి దిల్ రాజు, అల్లు అర్జున్ ముఖ్య అతిథులుగా ఆహ్వానించాను అయితే ఆ సమయంలో దిల్ రాజు నాపై కోప్పడ్డారు.. ఈ సినిమాలో తమ్ముడి క్యారెక్టర్ లో రామ్ ను తీసుకొని హీరోలుగా బన్నీ లేదా మహేష్ బాబుని తీసుకొని ఉంటే బాగుండేది అంటూ దిల్ రాజుగారు చెప్పారంటూ" ఆయన మాటల్లో చెప్పుకొచ్చారు.

Next Story

Most Viewed