ఆ కన్నడ బ్యూటీపై కన్ను.. సుకుమార్ భారీ ప్లాన్ !

by velandi.Saikiran |

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు ఉన్న సంగతి తెలిసిందే. కానీ అందులో కొంతమంది మాత్రమే మంచి సక్సెస్

ఆ కన్నడ బ్యూటీపై కన్ను.. సుకుమార్ భారీ ప్లాన్ !
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు ఉన్న సంగతి తెలిసిందే. కానీ అందులో కొంతమంది మాత్రమే మంచి సక్సెస్ అందుకొని దూసుకు వెళ్తున్నారు. అలాంటి వారిలో సుకుమారు ఒకరు. దర్శకుడు సుకుమార్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన తీసిన ప్రతి సినిమా బంపర్ హిట్ కావడం గ్యారెంటీ. కథతో సినిమా వచ్చిందంటే మినిమం గ్యారంటీ అందుకుంటుంది.

పుష్ప 2 సినిమాతో ఇండస్ట్రీని మొత్తం షేక్ చేశాడు. అలాంటి సుకుమార్ తన తర్వాతి సినిమా రామ్ చరణ్ తో తీయబోతున్నాడని జోరుగా ప్రచారం అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే సుకుమార్ తో సినిమాకు రెడీ అవుతాడట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan ). అయితే ఈ సినిమా నేపథ్యంలో ఇప్పటి నుంచే హీరోయిన్ కోసం వేట మొదలు పెట్టారట సుకుమార్ (sukumar).

చరణ్ తో సినిమా కోసం కన్నడ బ్యూటీ ని కూడా టచ్ చేసినట్లు తెలుస్తోంది. చరణ్ కు జోడిగా రుక్మిణి వసంత్ ను (rukmini vasanth) తీసుకుంటే బాగుంటుందని సుకుమార్ ఇప్పటికే ఆమెతో చర్చలు కూడా చేశారట. దీంతో ఆమె సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాక ఈ సినిమా వచ్చే ఏడాది లేదా ఈ ఏడాది చివరలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

Next Story