21 ఏళ్లకే అలాంటివి మొదలుపెట్టా.. పాయల్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్

by Disha Web Desk 6 |
21 ఏళ్లకే అలాంటివి మొదలుపెట్టా.. పాయల్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ఆర్‌ఎక్స్-100 సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. మొదటి చిత్రంలోనే మరీ బోల్డ్‌గా నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీ వచ్చిన తర్వాత పాయల్ పేరు నెట్టింట మార్మోగిపోయింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా హిట్ అందుకోలేక పోయింది. అయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ.. అభిమానులకు దగ్గరగా ఉంది. ఇటీవల ఆమె మంగళవారం మూవీతో ప్రేక్షకులను అలరించింది.

దీనిని అజయ్ భూపతి తెరకెక్కించాడు. థియేటర్స్‌లో విడుదలైన మంగళవారం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే పాయల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. ‘‘ 21 ఏళ్లకే మోడలింగ్ మొదలుపెట్టాను. ఈ ఫొటో అదే.. ఓ మ్యాగజైన్ కోసం మొదటి సారి ఫొటో షూట్ చేయించుకున్నా. ఢిల్లిలో ఈ షూట్ జరిగింది. తర్వాతే ముంబైకి షిఫ్ట్ అయ్యాను’’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం పాయల్ పోస్ట్ వైరల్ అవుతుండటంతో అది చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు.






Next Story

Most Viewed