ఆంటీ అనేవాళ్లే రేపిస్ట్‌లు.. మరోసారి ఇచ్చిపడేసిన అనసూయ (వీడియో)

by Hamsa |
ఆంటీ అనేవాళ్లే రేపిస్ట్‌లు.. మరోసారి ఇచ్చిపడేసిన అనసూయ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: యాంకర్ అనసూయ జబర్ధస్త్ షో ద్వారా ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత వెండితెరకు పరిచయం అయి తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తనను ట్రోల్ చేస్తున్న వారికి గట్టిగా సమాధానం చెప్తుంది. ఇటీవల ఈ అమ్మడుని ఆంటీ అని ట్రోల్ చేసిన విషయం తెలిసిందే. అలాగే ట్విట్టర్ మొత్తం ఆంటీ అనే పదాన్ని ట్రెండింగ్ చేశారు. దానికి అనసూయ కూడా స్ట్రాంగ్‌గా ఇచ్చిపడేసింది. ఆంటీ అనేవారిపై పోలీసు కేసు పెడతానని చెప్పడంతో ట్రోల్స్ తగ్గిపోయాయి.

తాజాగా, అనసూయ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆంటీ అంటే ఎందుకు కోపం వస్తుందో తెలిపింది. అలాగే ఇక నుంచి ఎవరూ అనకుండా గట్టిగా ఇచ్చిపడేసింది. ‘‘నేనేమన్నా పోస్ట్ చేస్తే ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకోవచ్చు కదా ఆంటీ అని అంటారు. ఆంటీ అనే పదం తప్పు కాదు. కానీ దాన్ని చాలా మంది వల్గర్ గా వాడతారు. చిన్న పిల్లలు, తెలిసిన వాళ్ళు వచ్చి ఆంటీ అని క్యూట్ గా పిలుస్తారు. చిన్న పిల్లలు ఆంటీ అని పిలిస్తే నాకు హ్యాపీనే. కానీ నా ఏజ్ లో ఉన్న వాళ్ళు ఆంటీ అని మరో రకంగా పిలుస్తారు. అది నాకు నచ్చదు. అసలు ఆంటీ అని ఇంగ్లీష్ లో పిన్నికి, అమ్మ తర్వాత అమ్మ లాంటి వాళ్ళని పిలవడానికి వాడతారు. నేను చిన్నప్పుడు చాలా మంది పక్కింటి వాళ్ళని ఆంటీ అనే పిలిచాను. ఒకవేళ వాళ్ళు నన్ను అలా పిలవొద్దు అంటే నేను పిలవను. నేను అలా పిలిస్తే వాళ్ళు హర్ట్ అవుతున్నారని నేను అర్ధం చేసుకొని ఆపేస్తాను. నాకు ఏదో కారణంతో నచ్చట్లేదు, నేను అదే చెప్పాను. అయినా మళ్ళీ మళ్ళీ ఎందుకు అనాలి. అవతలి వాళ్ళని ఎందుకు హార్ట్ చేయాలి. అలాంటి పైశాచిక ఆనందం ఎందుకు. నా మీద కామెంట్స్ వేసేవాడ్ని ఫేస్ టు ఫేస్ జన్మలో చూస్తానో కూడా లేదో తెలీదు, వాడు నన్ను చూస్తాడో లేదో తెలీదు. అయినా నా మీద అంత హేట్ ఉందంటే అతని చుట్టు పక్కన ఉన్న ఆడవాళ్ళని ఇంకెలా చూస్తాడు. ఇలాంటి వాళ్ళే ఫ్యూచర్ లో రేపిస్ట్‌లు అవుతారు’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.Next Story

Most Viewed