- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గతంలో కంటే బలంగా.. ఎప్పుడూ లేనంత క్రూరంగా ఉండబోతున్నాడు.. అనౌన్స్‌మెంట్‌తోనే హైప్ పెంచిన మేకర్స్
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా(Teja Sajja) చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయి ఫుల్ పాపులాకిటీ సంపాదించుకున్నాడు.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా(Teja Sajja) చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయి ఫుల్ పాపులాకిటీ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత సమంత ‘ఓ బేబీ’ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేశాడు. ఇక ‘జాంబి రెడ్డి’(Jambi Reddy)తో హీరోగా మారాడు. పలు చిత్రాల్లో నటించినప్పటికీ హిట్ అందుకోలేకపోయాడు. ఇక గత ఏడాది వచ్చిన ‘హనుమాన్’ మూవీతో పాన్ ఇండియా హీరోగా మారాడు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తేజ సజ్జా ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయాడు. ఒక్క ప్రాజెక్ట్‌తోనూ ఊహించని క్రేజ్‌ను రాబట్టుకున్న ఆయన వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.
ప్రస్తుతం ‘మిరాయ్’ (Mirai)మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. యాక్షన్ అడ్రెంచర్‌గా రాబోతుండగా కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni)తెరకెక్కిస్తున్నారు. ఇందులో మంచు మనోజ్(manchu manoj), శ్రియా శరణ్, జయరామ్, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనుండగా.. రితికా నాయక్(Ritika Nayak) హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ సెప్టెంబర్ 5న థియేటర్స్‌లోకి రాబోతుంది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసి మేకర్స్ ఫుల్ బిజీ అయిపోయారు. ఈక్రమంలోనే.. తాజాగా, ఆగస్టు 23న తేజ సజ్జా పుట్టినరోజే కావడంతో ఆయన మరో భారీ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాడు. ఈ చిత్రం రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కనుండగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. అయితే ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. అంతేకాకుండా ‘‘చేతిపై ఎక్స్-2 ప్రపంచం చివర వరకు ఉండబోతుంది. గతంలో కంటే బలంగా అత్యంత క్రూరంగా ఈ సినిమా ఉండనుంది’’ అనే క్యాప్షన్ జత చేసి హైప్ పెంచారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.






