- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఊపిరిపీల్చుకోవడానికి వెనక్కి తగ్గుతున్నా.. మానసిక ఆరోగ్యం కోసం కామాక్షి భాస్కర్లు షాకింగ్ నిర్ణయం.. వైరల్‌గా మారిన పోస్ట్
నటన మీద విసుగు వచ్చి నేను ఈ బ్రేక్ తీసుకోవడం లేదు. కేవలం నా మానసిక ఆరోగ్యానికి, స్వీయ సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ టాలెంట్ కామాక్షి భాస్కర్ల తన సహజమైన నటనతో అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా 'మా ఊరి పొలిమేర' సినిమాలో ఆమె చేసిన డీ-గ్లామర్ పాత్ర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ, గ్లామరస్ రోల్స్‌లోనూ మెరిసి సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. ఇటీవల అడివి శేష్ 'డెకాయిట్' మూవీలోనూ ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం ఆమె చేతిలో అగధ, మా ఊరి పొలిమేర-3' వంటి క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. కెరీర్ ఇలా ఫుల్ స్వింగ్‌లో ఉన్న సమయంలో కామాక్షి ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంది.తాజాగా కామాక్షి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పెట్టిన ఒక పోస్ట్ ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది. తాను నటనకు మరియు కెమెరాకు కొంతకాలం పాటు విరామం ఇస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న బలమైన కారణాన్ని కూడా ఆమె వివరించింది. తన నిర్ణయం గురించి కామాక్షి స్పందిస్తూ.. "నటన మీద విసుగు వచ్చి నేను ఈ బ్రేక్ తీసుకోవడం లేదు.
కేవలం నా మానసిక ఆరోగ్యానికి, స్వీయ సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను. ప్రస్తుతం నాకు ఎలాంటి తొందర లేదు. ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటూ, నా ఉనికిని నేను గుర్తు చేసుకోవాలనుకుంటున్నాను. కొన్నిసార్లు మన లక్ష్యాలను మరింత ఉత్సాహంగా చేరుకోవాలంటే, కొంచెం వెనక్కి తగ్గి శక్తిని కూడగట్టుకోవాలి. అందుకే ఈ విరామం.. కానీ నేను ఎక్కడికీ వెళ్లిపోలేదు, మళ్ళీ వస్తాను" అని చాలా స్పష్టంగా చెప్పుకొచ్చింది.గ్లామర్ ప్రపంచంలో నిరంతరం పని ఒత్తిడిలో ఉండే నటీనటులు తమ వ్యక్తిగత ప్రశాంతత కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా అరుదు. కామాక్షి తన ఆరోగ్యం కోసం తీసుకున్న ఈ ధైర్యవంతమైన స్టెప్‌ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. "మీ ఆరోగ్యం అన్నిటికంటే ముఖ్యం, ప్రశాంతంగా తిరిగి రండి" అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు ఈ సమయంలో.. అంత మానసిక ఒత్తిడి? ఏంటా అని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వరుస ప్రాజెక్టులు చేతిలో ఉన్నా కూడా, కెరీర్ కంటే తన మనశ్శాంతికే ఎక్కువ విలువనిచ్చిన కామాక్షి తీరు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.






