స్టార్ సింగర్ మంగ్లీకి యాక్సిడెంట్.. ‘నిజమే కానీ’ అంటూ పోస్ట్

by Disha Web Desk 7 |
స్టార్ సింగర్ మంగ్లీకి యాక్సిడెంట్.. ‘నిజమే కానీ’ అంటూ పోస్ట్
X

దిశ, సినిమా: స్టార్ సింగర్ మంగ్లీ కారుకు యాక్సిడెంట్ అయినట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. రంగారెడ్డి జిల్లా నందిమా కన్హ ఆధ్యాత్మిక మహోత్సవానికి హాజరై తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో శంషాబాద్ తొండుపల్లి సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. ఇందులో సింగర్ మంగ్లీ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకోగా కారులో ఉన్న ముగ్గురుకి మాత్రం స్వల్ప గాయాలు అయినట్లు నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీంతో మంగ్లీ ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు.

ఈ క్రమంలోనే ఈ ప్రమాదంపై స్పందించింది సింగర్ మంగ్లీ. తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ‘ప్రియమైన అందరికి,. నేను క్షేమంగా ఉన్నాను. ఇది రెండు రోజుల క్రితం జరిగిన అనుకోని చిన్న ప్రమాదం. దయచేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పుకార్ల జోలికి వెళ్లవద్దు. మీ ప్రేమ, శ్రద్ధకు ధన్యవాదాలు!’ అంటూ పోస్ట్ పెట్టింది మంగ్లీ. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రకరకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు.

Read More..

కారు ఢీకొని స్టార్ హీరోయిన్‌కు తీవ్రగాయాలు.. ఐసీయూలో చికిత్స పొందుతూ సాయం కోరుతున్న నటి!



Next Story

Most Viewed