‘ధురంధర్’ నుంచి డబుల్ అప్డేట్ విడుదల..గ్యాంగ్‌స్టర్‌గా స్టార్ హీరో.. అంచనాలను పెంచేస్తున్న ట్వీట్

by Mallepaka Hamsa |

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్(Ranveer Singh) వరుస సినిమాల్లో నటిస్తున్నప్పటికీ హిట్ అందుకోలేకపోతున్నాడు.

‘ధురంధర్’ నుంచి డబుల్ అప్డేట్ విడుదల..గ్యాంగ్‌స్టర్‌గా స్టార్ హీరో..  అంచనాలను పెంచేస్తున్న ట్వీట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్(Ranveer Singh) వరుస సినిమాల్లో నటిస్తున్నప్పటికీ హిట్ అందుకోలేకపోతున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ధురంధర్’(Dhurandhar). నేడు ఆయన పుట్టినరోజు కావడంతో చిత్రబృందం రణ్‌వీర్ సింగ్ ఫస్ట్ లుక్‌ టీజర్‌ను విడుదల చేసి అభిమానులకు సర్‌‌ప్రైజ్ ఇచ్చారు. అంతేకాకుండా ఈ మూవీ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు. ఇక విడుదలైన టీజర్‌లో రణ్‌వీర్ సింగ్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించి ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశాడు.

అయితే ఈ సినిమాకు నేషనల్ అవార్డు విన్నర్ ఆదిత్య ధర్(Aditya Dhar) దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆయన తెరకెక్కిస్తున్న రెండో ప్రాజెక్ట్ కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని బి62 స్టూడియోస్, జియో స్టూడియోస్ బ్యానర్స్‌పై లోకేష్ ధర్, ఆదిత్య ధర్ నిర్మిస్తున్నారు. ఇందులో సంజయ్ దత్(Sanjay Dutt), అక్షయ్ ఖన్నా(Akshaye Khanna), ఆర్, మాధవన్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

link

Next Story