- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్లాక్ బస్టర్ హిట్ సీక్వెల్‌లో స్టార్ హీరోయిన్ ఫిక్స్
గత కొద్ది కాలంగా సీక్వెల్స్ ట్రెండ్ కొనసాగుతోంది. ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలకు సీక్వెల్స్ చేస్తూ దర్శకనిర్మాతలు భారీగానే సంపాదిస్తున్నారు.

దిశ, సినిమా: గత కొద్ది కాలంగా సీక్వెల్స్ ట్రెండ్ కొనసాగుతోంది. ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలకు సీక్వెల్స్ చేస్తూ దర్శకనిర్మాతలు భారీగానే సంపాదిస్తున్నారు. అయితే కొన్ని సినిమాలు బాక్సాఫీసు వద్ద మెప్పించలేకపోయినప్పటికీ కలెక్షన్లు భారీగానే రాబడుతూ రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. దీంతో చాలామంది సీక్వెల్స్ ప్రకటిస్తున్నారు. ఇక 2024లో వచ్చిన ‘క్రూ’ (Crew)చిత్రానికి సైతం సీక్వెల్ రాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఇందులో కృతి సనన్(Kriti Sanon), టబు(tabu) కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
తాజాగా, మరో స్టార్ హీరోయిన్ జాయిన్ అయినట్లు సమాచారం. బాలీవుడ్ స్టార్ బ్యూటీ కరీనా కపూర్ (Kareena Kapoor)కూడా ఇందులో ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు టాక్. స్క్రిప్ట్ పూర్తి కావొస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా త్వరలో స్టార్ట్ కాబోతున్నట్లు సమాచారం. మొదటి పార్ట్ ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేస్తున్న ముగ్గురు మహిళల జీవితం ఆధారంగా నిర్మించగా.. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా రాబోతున్నట్లు టాక్. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.






