స్టార్ హీరో Upendra Rao (ఉపేంద్ర) తీవ్ర అస్వస్థత

by Sathputhe Rajesh |   (  Updated:2022-11-25 06:41:02  IST  )

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర అస్వస్థతకు గురయ్యారు.

స్టార్ హీరో  Upendra Rao (ఉపేంద్ర)  తీవ్ర అస్వస్థత
X

దిశ, వెబ్ డెస్క్: కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర అస్వస్థతకు గురయ్యారు. ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న ఆయన లొకేషన్ లో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో చిత్ర యూనిట్ హుటాహుటిన ఉపేంద్రను బెంగళూరు సమీపంలోని నేలమంగలలోని ఆస్పత్రికి తరలించారు. 53 ఏళ్ల ఉపేంద్ర గత కొన్ని రోజులుగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. యాక్షన్ సన్నివేశాల్లో ఒక్కసారిగా దుమ్ము లేవడంతో అయిన అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. ఉపేంద్రకు డస్ట్ ఎలర్జీ ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఉపేంద్ర అస్వస్థతకు గురవ్వడం పట్ల ఆయన ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. కాగా ఉపేంద్ర తెలుగులోను పలు చిత్రాల్లో నటించారు. సన్నాఫ్ సత్యమూర్తిలో విలన్‌గా నటించారు.

Next Story