‘SSMB-29’ సినిమాలో స్టార్ హీరో.. శక్తివంతమైన, క్రూరమైన విరోధి పోస్టర్ రిలీజ్

by Mallepaka Hamsa |   (  Updated:2025-11-07 07:32:50  IST  )

అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘SSMB-29’.

‘SSMB-29’ సినిమాలో స్టార్ హీరో.. శక్తివంతమైన, క్రూరమైన విరోధి పోస్టర్ రిలీజ్
X

దిశ, సినిమా: అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘SSMB-29’. సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), రాజమౌళి (Rajamouli)కాంబోలో రాబోతున్న ఈ సినిమా కోసం అభిమానులంతా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్నప్పటికీ ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ కూడా విడుదల చేయకుండా.. రాజమౌళి పక్కా ప్లాన్‌తో ఉన్నారు. ఒక నవంబర్‌లో ఒక్కొక్క అప్డేట్ ప్రకటిస్తానని చెప్పి ఫ్యాన్స్‌కు పండగ చేసుకునేలా చేశారు.

తాజాగా, రాజమౌళి, సూపర్ స్టార్ అభిమానులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఈ సినిమా నుంచి మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను షేర్ చేసి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. ‘‘పృథ్వీతో మొదటి షాట్ పూర్తవగానే అతని దగ్గరికి వెళ్లి నాకు తెలిసిన అత్యుత్తమ నటుల్లో మీరు ఒకరు అని చెప్పాను. శక్తివంతమైన, క్రూరమైన విరోధి ‘కుంభ’పాత్రకు ప్రాణం పోయడం సంతృప్తికరంగా ఉంది. తన కుర్చీలో లీనమైపోయినందుకు పృథ్వీకి ధన్యవాదాలు.’’ అని ట్విట్టర్ రాసుకొచ్చారు.

అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ వీల్‌చైర్‌లో కూర్చొని రోబో పాయంతో ఒక భారీ సీన్‌లో ఉన్నట్లుగా ఉన్న పోస్టర్‌తో హైప్ పెంచారు. దీనిని ప్రముఖ శాస్తవేత్త స్టీఫెన్ హాకింగ్‌ను ప్రేరణగా తీసుకుని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ అప్డేట్‌తో పాటు నవంబర్ 15న ఈ చిత్రానికి సంబంధించిన మరో బిగ్ అప్డేట్ కూడా రాబోతుండటం విశేషం. నేడు మహేష్ పోస్టర్ వస్తుందనుకుంటే.. పృథ్వీరాజ్ ది విడుదల చేశారు. ఇక నవంబర్ 15 అయినా మహేష్ బాబు పోస్టర్ రిలీజ్ చేస్తారని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Next Story