‘బోర్డర్-2’లో సైనికుడిగా స్టార్ హీరో.. గూస్ బంప్స్‌ను తెప్పిస్తోన్న ఫస్ట్ లుక్‌ పోస్టర్

by Mallepaka Hamsa |   (  Updated:2025-11-05 12:01:23  IST  )

ఇండస్ట్రీలో సీక్వెల్స్ హవా నడుస్తోంది. పలు సినిమాలు బాక్సాఫీసు వద్ద హిట్ అవడంతో.. వాటికి సీక్వెల్స్ తెరకెక్కించే పనిలో మూవీ మేకర్స్ ఫుల్ బిజీ అయిపోతున్నారు.

‘బోర్డర్-2’లో సైనికుడిగా స్టార్ హీరో.. గూస్ బంప్స్‌ను తెప్పిస్తోన్న ఫస్ట్ లుక్‌ పోస్టర్
X

దిశ, సినిమా: ఇండస్ట్రీలో సీక్వెల్స్ హవా నడుస్తోంది. పలు సినిమాలు బాక్సాఫీసు వద్ద హిట్ అవడంతో.. వాటికి సీక్వెల్స్ తెరకెక్కించే పనిలో మూవీ మేకర్స్ ఫుల్ బిజీ అయిపోతున్నారు. ఇప్పటికే సీక్వెల్స్‌గా వచ్చిన చిత్రాలెన్నో బ్లాక్ బప్టర్ హిట్‌గా నిలిచాయి. ఇక ఇప్పుడు మరో సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ‘బోర్డర్’ సీక్వెల్‌ తెరకెక్కుతోంది. ఇది లాంగేవాలా యుద్ధం (1971) సంఘటనల ఆధారంగా రూపొందించబడింది. 1971 ఇండో-పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో సాగుతుంది. దేశం కోసం పోరాడిని ధైర్యవంతుల కథలను ఇందులో చూపించబోతున్నారు. అనురాగ్ సింగ్(Anurag Singh) దర్శకత్వంలో తెరకెక్కుతుండగా.. జెపి ఫిల్మ్స్, టి సిరీస్ బ్యానర్స్‌పై నిధి దత్తా, భూషన్ కుమార్ నిర్మిస్తున్నారు.

ఇందులో సన్నీ డియోల్, దిల్జిత్ దోశాంజ్, ఆహాన్ శెట్టి, మేధా రానా, మోనా సింగ్, సోనమ్ బజ్వా, వరుణ్ ధావన్(Varun Dhawan) ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి వరుస అప్డేట్స్ విడుదల అవుతున్నాయి. తాజాగా, ‘బోర్డర్-2’ నుంచి స్టార్ హీరో వరుణ్ ధావన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రతి యూనిఫాం ధైర్యానికి సంబంధించిన కథ చెబుతుంది. ఇది సైనికుల హృదయాలను, దేశాన్ని గర్వించేలా చేస్తుంది’’ అని తెలిపారు.

ఇక విడుదలైన పోస్టర్‌లో వరుణ్.. పోలీస్ డ్రెస్ ధరించి దానిపై స్వెటర్ ధరించి ఓ పెద్ద గన్ పట్టుకుని దేశంపై యుద్ధానికి వచ్చిన వారిపై దాడి చేస్తూ కనిపించాడు. ముఖమంతా రక్తం ఉండగా.. చూట్టూరా యుద్ధానికి వచ్చిన పొరుగు దేశస్తుల శవాలు కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో గూస్ బంప్స్‌ను తెప్పిస్తున్నాయి. ఇందులో సైనికుడి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఏ పాత్రలో అనేది మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Next Story