Suma Kanakala :స్టార్ యాంకర్ సుమ కాళ్లకు గాయాలు.ఇన్‌స్టా పోస్ట్ వైరల్

by Disha Web Desk 6 |
Suma Kanakala  :స్టార్ యాంకర్ సుమ కాళ్లకు గాయాలు.ఇన్‌స్టా పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: బుల్లితెర స్టార్ యాంకర్ సుమ తన మాటలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకుంది. ఎంత పెద్ద షో అయినా ఏమాత్రం తడబడకుండా తన మాటలతో ఆకట్టుకుంటుంది. షోస్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అంటూ క్షణం తీరిక లేకుండా పాల్గొంటుంది. ఆమెను తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను పంచుకుంటుంది. తాజాగా, తన కాళ్లకు గాయాలు అయిన ఫొటోలు షేర్ చేసి అందరిని షాక్‌కి గురి చేసింది. ప్రస్తుతం సుమ ఫారిన్ ట్రిప్‌లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తుంది. ట్రిప్‌లో బాగా తిరగడం వల్ల షూస్ కొరికేయడంతో కాళ్లకు గాయాలు అయి తీవ్రమైన బాధ కలిగిస్తున్నాయని తెలిపింది. ‘‘ జస్ట్ ఫర్ ఫన్. నా కాళ్లకు దెబ్బలు తగిలాయని తంబ్‌నెయిల్స్ పెట్టకండి. షూస్ కొరికేయడం వల్ల ఇలా జరిగింది. నన్ను ఆ మమ్మీ అని ఎందుకు పిలుస్తారో ఇప్పుడు నాకు తెలుసు’’ అంటూ రాసుకొచ్చింది. దీంతో అది చూసిన అభిమానులు రెస్ట్ తీసుకోండి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Also Read: విజయ్‌ దేవరకొండతో వివాదం.. తొలిసారి అనసూయ హాట్ కామెంట్స్..

రూటు మార్చిన శ్రీముఖి.. ఎందుకో తెలుసా?



Next Story

Most Viewed