మెగాస్టార్‌ను ఇబ్బంది పెట్టిన శ్రీముఖి.. సిగ్గుపడుతున్న చిరు (వీడియో)

by Disha Web Desk 7 |
మెగాస్టార్‌ను ఇబ్బంది పెట్టిన శ్రీముఖి.. సిగ్గుపడుతున్న చిరు (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి హీరోగా, మోహన్ రాజా డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా 'గాడ్ ఫాదర్'. పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా మలయాళీ సూపర్ హిట్ మూవీ లూసిఫర్‌‌కు రిమేక్. కాగా 'గాడ్ ఫాదర్' సినిమా రిలీజ్ సమయం దగ్గర పడటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచింది చిత్ర బృందం. ఈ క్రమంలో శ్రీముఖితో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు చిరంజీవి. ఫ్లైట్ జర్నీలో ఈ ఇంటర్వ్యూ చాలా ఫన్నీగా జరిగింది. శ్రీముఖి తనదైన స్టైల్లో చిలిపి ప్రశ్నలు అడుగుతుంటే.. వాటికి ధీటుగా చిరు జవాబులు ఇచ్చారు.

ఈ క్రమంలోనే శ్రీముఖి ఐ లవ్ యూ చిరంజీవి గారు, ఈ లుక్‌లో మీరు చాలా హాట్‌గా ఉన్నారు అంటూ కామెంట్ చేసింది. దానికి చిరు చాలా ఇబ్బందిపడుతూ.. సిగ్గుతో తడపడుతూ ఇంటర్వ్యూ ముందుకు కొనసాగించారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా.. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కాగా, ఈ సినిమా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


Next Story

Most Viewed