ఆ స్టార్ హీరోతో శ్రీలీల డేటింగ్.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికేశారుగా.. వీడియో వైరల్

by Gugulothu.Kavitha |

‘పెళ్లి సందడి’(Pelli Sandadi) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ శ్రీ లీల(Sree Leela) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఆ స్టార్ హీరోతో శ్రీలీల డేటింగ్.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికేశారుగా.. వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘పెళ్లి సందడి’(Pelli Sandadi) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ శ్రీ లీల(Sree Leela) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ మూవీతోనే ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది ఈ భామ. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక ఈ అమ్మడు డ్యాన్స్‌కి అయితే ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. రీసెంట్ సుకుమార్(Sukumar) డైరెక్షన్‌లో అల్లు అర్జున్(allu Arjun) హీరోగా, రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించిన పుష్ప-2(Pushpa-2) మూవీలో శ్రీలీల ‘కిస్సిక్’(Kissik) అనే ఐటెం సాంగ్‌లో చిందులేసింది.

ఆ బ్యూటీ డాన్స్‌కి ఫుల్ మార్కులే పడ్డాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ.. రవితేజ(Raviteja) ‘మాస్ జాతర’, విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటిస్తున్న ‘VD-12’, శివ కార్తికేయన్(Sivakarthikeyan) ‘పరాశక్తి’(Parasakthi) మూవీతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్(Ibrahim Ali Khan) సరసన ఓ హారర్ కామెడీ థ్రిల్లర్ సినిమాలో నటిస్తోంది. అలా వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ చదువులోనూ యాక్టీవ్‌గా ఉంటూ తన పై చదువులు పూర్తి చేసుకుంటుంది. అంతేకాకుండా నిత్యం సోషల్ మీడియా(social Media)లోనూ నిత్యం యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారుకు హీట్ పుట్టిస్తోంది.

ఈ క్రమంలో ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇటీవల ముంబయిలో బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్‌తో కలిసి కనిపించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్​గా మారింది. ముంబయిలోని ఓ రెస్టారెంట్​ నుంచి బయటకు వస్తున్న వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. శ్రీలీల- కార్తిక్ ముంబయి సిటీలో డిన్నర్​ చేసేందుకు వెళ్లగా కెమెరాలకు చిక్కారు. ఇందులో శ్రీలీల ట్రెండీ ఔట్​ఫిట్​లో మెరవగా, కార్తిక్​ క్యాజువల్​ లుక్​లో కనిపించారు. అయితే ఈ ఇద్దరూ రిలేషన్​షిప్​లో ఉన్నారని కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా డిన్నర్​కు వెళ్లడంతో ఈ రూమర్స్​కు బలం చేకూరినట్లైంది. ​

నిజంగానే ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందంటూ కామెంట్స్​ పెడుతున్నారు. కాగా శ్రీలీల- ఆర్యన్ ప్రస్తుతం​ అనురాగ్​ బసుతో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం రొమాంటిక్​ బ్యాగ్​ డ్రాప్​లో తెరకెక్కుతోంది. ఇందులో లీడ్​ రోల్స్​లో కనిపించనున్నారు. ఈ క్రమంలోనే వీళ్లద్దరూ తరచూ కలవడం, కెమెరా కంటికి చిక్కడం లాంటివి జరుతున్నాయి. తాజాగా షూటింగ్ కంప్లీట్ అయ్యాక డిన్నర్​కు వెళ్లినట్లు తెలుస్తోంది. గతంలో కూడా వీళ్లపై ఇలాంటి రూమర్సే వచ్చాయి. కానీ, దీనిపై ఈ ఇద్దరూ క్లారిటీ ఇవ్వలేదు. Link

Next Story