- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలీవుడ్‌ను షేక్ చేయబోతున్న శ్రీకాంత్ ఓదెల.. స్టార్ హీరోతో యాక్షన్ థ్రిల్లర్‌కు స్కెచ్!
అక్షయ్ కుమార్ కోసం ఒక అదిరిపోయే యాక్షన్ స్టోరీని సిద్ధం చేశారట శ్రీకాంత్ ఓదెల. ఇప్పటికే అక్షయ్‌తో చర్చలు కూడా జరిగాయని, ఆయనకు శ్రీకాంత్ చెప్పిన కథ బాగా నచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి.

దిశ, సినిమా: తొలి సినిమా ‘దసరా’తోనే బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించి, తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కును క్రియేట్ చేసుకున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. ఇప్పుడు ఆయన పేరు ఇటు టాలీవుడ్‌లోనూ, అటు బాలీవుడ్‌లోనూ మార్మోగిపోతోంది. నాచురల్ స్టార్ నానితో కలిసి ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న ‘ది ప్యారడైజ్’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్‌డేట్స్‌తో పాటు శ్రీకాంత్ ఓదెల బాలీవుడ్ ఎంట్రీ గురించి వినిపిస్తున్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. శ్రీకాంత్ ఓదెల - నాని కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ‘ది ప్యారడైజ్’. ఇది పక్కా యాక్షన్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. మేకర్స్ ఇప్పటికే రిలీజ్ డేట్‌ను కూడా ఫిక్స్ చేసేశారు. ఈ ఏడాది ఆగస్టు 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘దసరా’లో నానిని ఊరమాస్ అవతారంలో చూపించిన శ్రీకాంత్, ఈసారి ‘ది ప్యారడైజ్’లో నానిని ఏ రేంజ్‌లో చూపిస్తారో అని అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
శ్రీకాంత్ ఓదెల టాలెంట్‌పై బాలీవుడ్ కన్ను పడింది. తాజా సమాచారం ప్రకారం, ఆయన బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కోసం ఒక అదిరిపోయే యాక్షన్ స్టోరీని సిద్ధం చేశారట. ఇప్పటికే అక్షయ్‌తో చర్చలు కూడా జరిగాయని, ఆయనకు శ్రీకాంత్ చెప్పిన కథ బాగా నచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అంతా ఓకే అయితే, శ్రీకాంత్ ఓదెల బాలీవుడ్‌లోకి ఘనంగా అడుగుపెట్టడం ఖాయం. ఒక తెలుగు యంగ్ డైరెక్టర్ హిందీ ఇండస్ట్రీలో అక్షయ్ కుమార్ లాంటి స్టార్‌తో సినిమా ఆఫర్ అందుకోవడం విశేషం. కేవలం రెండో సినిమాకే బాలీవుడ్ రేంజ్ ఆలోచన చేయడంపై నెటిజన్లు శ్రీకాంత్‌ను అభినందిస్తున్నారు. శ్రీకాంత్ మేకింగ్ స్టైల్ చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది. అలాంటి స్టైల్ అక్షయ్ కుమార్‌కు బాగా సూట్ అవుతుందని సినిమా విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి శ్రీకాంత్ ఓదెల తన విజన్ తో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక సెన్సేషన్‌గా మారబోతున్నారు.






