రోషన్ కనకాల ‘మోగ్లీ’ సినిమాకు శ్రీవిష్ణు రివ్యూ..

by Mallepaka Hamsa |

రోషన్ కనకాల(Roshan Kanakala), సాక్షి మడోల్కర్ (Sakshi Madolkar)జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మోగ్లీ’(Mowgli).

రోషన్ కనకాల ‘మోగ్లీ’ సినిమాకు శ్రీవిష్ణు రివ్యూ..
X

దిశ, సినిమా: రోషన్ కనకాల(Roshan Kanakala), సాక్షి మడోల్కర్ (Sakshi Madolkar)జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మోగ్లీ’(Mowgli). బండి సరోజ్ కుమార్, హర్ష చెముడు కీలక పాత్రలో కనిపించారు. నేషనల్ అవార్డు విన్నర్ సందీర్ రాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను పీపుల్ మీడియా బ్యానర్‌పై నిర్మించారు. డిసెంబర్ 13న విడుదలైన ఈ లవ్ స్టోరీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో మాత్రం మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంటుంది. మోడర్న్ సితారాముల కథగా వచ్చిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య వచ్చి పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంటుంది. తాజాగా, ఈ సినిమా చూసిన టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు ప్రశంసలు కురిపించారు. ‘‘మోగ్లీ’ మూవీ చాలా బాగుంది.

ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో కొత్త లవ్ స్టోరీ. యాక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు హీరో రోషన్ చాలా బాగా చేశారు. బండి సరోజ్ కుమార్ గారు పోలీస్ రోల్‌లో అదరగొట్టేశారు. క్లైమాక్స్ చాలా బాగుంది. మంచి డివోషనల్ టచ్ ఇచ్చారు. తప్పకుండా యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి ఈ సినిమాని పెద్ద సక్సెస్ చేస్తారు. మ్యూజిక్ డైరెక్టర్ కాల భైరవ అద్బుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. డైరెక్టర్ సందీప్ రాజ్ మంచి సినిమా తీశారని పేర్కొన్నాడు. అలాగే ఈ చిత్రాన్ని అందరూ చూడాలని విజ్ఞప్తి చేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

Next Story