డైరెక్టర్ పూరీ పై శ్రీరెడ్డి సంచలన కామెంట్స్

by Disha Web Desk 16 |
డైరెక్టర్ పూరీ పై శ్రీరెడ్డి సంచలన కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: విజయ్ దేవరకొండ, అనన్యపాండే కాంబోలో తెరకెక్కిన సినిమా లైగర్. ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద నెగిటివ్ టాక్ రావడంతో ప్లాప్ గా నిలిచింది. ఆర్జీవీ లైగర్ చూసిన తర్వాత పూరీ మంచి సినిమాలు తీసే డైరెక్టర్ అంటూనే, పూరీ జగన్నాథ్ ను వెంటనే కొట్టాలనిపిస్తుందని కామెంట్స్ చేశారు. తాజాగా శ్రీ రెడ్డి కూడా పూరీపై తన స్టైల్లో విమర్శలు చేశారు. లైగర్ సినిమాలో అసలు కంటెంటే లేదన్నారు. కంటెంట్ లేని సినిమాలకు ఇంతగా ప్రమోషన్స్, హైప్ ఇవ్వడం అవసరమా? అని ప్రశ్నించారు. తీసే సినిమాలు అన్నీ ప్లాప్ సినిమాలే అయినా మహేశ్ బాబు డేట్స్ ఇవ్వడం లేదని చెప్పడం ఏంటో అని విరుచుకుపడ్డారు. ప్రస్తుతం శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Next Story

Most Viewed