Sreemukhi : బంపర్ ఆఫర్ కొట్టేసిన శ్రీముఖి.. స్టార్ హీరో సినిమాలో అవకాశం!

by Disha Web Desk 8 |
Sreemukhi : బంపర్ ఆఫర్ కొట్టేసిన శ్రీముఖి.. స్టార్ హీరో సినిమాలో అవకాశం!
X

దిశ, ఫీచర్స్ : యాంకర్ శ్రీముఖి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పలు షోస్‌లల్లో తనదైన స్టైల్‌లో యాంకరింగ్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. యాంకరింగ్‌నే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన సత్తా చాటుకుంది. బిగ్ బాస్‌లో రన్నర్‌గా కూడా నిలిచింది. ఇక ఈ అమ్మడు ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన హాట్ ఫోటో షూట్‌తో కుర్రకారుకు ట్రీట్ ఇస్తూ ఉంటుంది. దీంతో అమ్మడు గురించి నెట్టింట తెగ చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఈ మధ్య శ్రీముఖి పెళ్లి గురించి అనేక వార్తలు పుట్టుకొస్తున్నాయి. త్వరలోనే ఈ ముద్దుగుమ్మ మూడు ముళ్లు వేసుకోబోతుదంటు గుస గుసలు వినిపిస్తుంటాయి.

కానీ ఈ ముద్దుగుమ్మ మాత్రం కెరీర్‌పై ఫోకస్ పెట్టి, పలు షోలను రన్ చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీముఖి ఓ బంపర్ ఆఫర్ కొట్టేసిదంట. అది ఏమిటంటే? అట్లీ అండ్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాగా, ఈ సినిమాలో అల్లు అర్జున్‌కి సిస్టర్ రోల్‌గా శ్రీముఖి బాగుంటుందని ఆమె అప్రోచ్ అయినట్లు సమాచారం.ఇక స్టార్ హీరో సినిమాలో అవకాశం వస్తే శ్రీముఖి సైతం వదులుకుంటుందా? ఓకే అని అగ్రిమెంట్ మీద సైన్ పెట్టిందట. త్వరలోనే ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించనున్నట్లు సమాచారం.


Next Story

Most Viewed