Sreeleela: శ్రీలీల బర్త్ డే స్పెషల్.. ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ నుంచి మెస్మరైజింగ్ లుక్ విడుదల చేసిన మేకర్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-06-14 14:21:01  IST  )

టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల(sreeleela) అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది.

Sreeleela: శ్రీలీల బర్త్ డే స్పెషల్.. ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ నుంచి మెస్మరైజింగ్ లుక్ విడుదల చేసిన మేకర్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల(sreeleela) అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. సినీ ఎంట్రీ ఇచ్చిన సమయంలోనే పలు హిట్స్ తన ఖాతాలో వేసుకున్న ఈ భామ ఇండస్ట్రీని షేక్ అయ్యేలా చేస్తోంది. ఇక ఇటీవల వరుస నాలుగు సినిమాలు ఫ్లాప్ కావడంతో కొద్ది రోజుల పాటు ఇండస్ట్రీకి కాస్త గ్యాప్ ఇచ్చింది. మళ్లీ ‘పుష్ప-2’లో కిస్సిక్ సాంగ్‌తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి శ్రీలీల డ్యాన్స్‌కు బాగానే మార్కులు పడ్డాయి. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్‌లో అవకాశాలు అందుకుంటూ ఫుల్ షామ్‌లో ఉంది. శ్రీలల సినిమాల విషయానికొస్తే.. తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్(Siva Karthikeyan) సరసన పరాశక్తి(Parashakti)లో చేస్తోంది. అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తోంది. యంగ్ హీరో కార్తిక్ ఆర్యన‌్‌తో ‘అషికి-3’ మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది. అంతేకాకుండా జూనియర్, మాస్ జాతర, లెనిన్ వంటి చిత్రాల్లోనూ ఈ భామ కీ రోల్ ప్లే చేయనుంది. ఇక తెలుగులో ఈ అమ్మడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan)తో మోస్ట్ వెయిటెడ్ సినిమా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’(Ustad Bhagat Singh)లో రొమాన్స్ చేయనుంది.

అయితే నేడు (జూన్ 14) శ్రీలీల పుట్టినరోజు కావడంతో ఆమెకు విషెస్ తెలుపుతూ చిత్రబృందం స్పెషల్ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇక ఇందులో శ్రీలీల ఆరెంజ్ కలర్ చుడీదార్ ధరించిన ఆమె చేతిలో కాఫీ కప్ పట్టుకుని సింపుల్ లుక్‌తో అందరినీ మెస్మరైజ్ చేస్తోంది. ఇక అది చూసిన నెటిజన్లు ఆమె అందానికి ఫిదా అయిపోతున్నారు. కాగా, ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. అచితూ ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచలి రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమాకు సంబంధించిన పలు సీన్స్‌ను పవన్ నాలుగు వారాల్లో పూర్తి చేయనున్నారు. వీలైనంత త్వరగా పూర్తి చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నారు. ఈ షెడ్యూల్‌లో పవన్ కళ్యాణ్‌తో పాటు శ్రీ లీల కూడా జాయిన్ అయ్యారు. ప్రస్తుతం పవన్, శ్రీ లీల సహా ప్రధాన తారాగణం మీద దర్శకుడు హరీష్ శంకర్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. శ్రీ లీల లేటెస్ట్ స్టిల్ ఈ షెడ్యూల్‌లోదే అని సమాచారం.

Next Story