- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలీవుడ్ హీరోతో శ్రీలీల డేటింగ్.. క్యూట్ జోడి అంటున్న నెటిజన్లు.. హాట్ టాపిక్‌గా మారిన ఏజ్ గ్యాప్! (వీడియో)
టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల(Sreeleela) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

దిశ, సినిమా: టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల(Sreeleela) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు ‘పెళ్లి సందడి’ మూవీతో ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ ‘ధమాకా’తో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. దీంతో అమ్మడు రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. వరుస అవకాశాలు అందుకుంటూ క్రేజీ బ్యూటీగా మారింది. దీంతో అంతా ఇండస్ట్రీని షేక్ చేస్తుందని అనుకుంటున్న సమయంలోనే శ్రీలీల నటించిన నాలుగు సినిమాలు బాక్సాఫీసు వద్ద రాణించలేకపోయాయి. ఆ తర్వాత అమ్మడుకి వచ్చిన క్రేజ్ కాస్త ఒక్కసారిగా తగ్గిపోయింది. దీంతో హీరోయిన్‌గా తీసుకున్న చిత్రాల నుంచి కూడా తొలగించేశారు. ఏం చేయలేక శ్రీలీల కొద్ది రోజులపాటు యాడ్స్ చేసింది. మళ్లీ ‘పుష్ప-2’ రీఎంట్రీ ఇచ్చి అందరినీ షాక్‌కు గురి చేసింది.
ఈ మూవీలో ఐటమ్ సాంగ్ చేసి ఇండస్ట్రీని షేక్ చేసిందనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం శ్రీలీల భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. మాస్ జాతర(mass jathara), ఉస్తాద్ భగత్ సింగ్(Ustad Bhagat Singh), పరాశక్తి, ధుబారి, లెనిన్, ఆషికి-3(Aashiqui-3) వంటి మూవీస్ చేస్తోంది. త్వరలో ‘జూనియర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, శ్రీలీలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ అమ్మడు బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో డేటింగ్ చేస్తున్నట్లు పలు పుకార్లు షికారు చేస్తున్నాయి.
ఆమె గత కొద్ది కాలంగా ఆయనతో క్లోజ్ ఉంటున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఫ్యామిలీ పార్టీలకు కూడా హాజరవుతోంది. ఇక ఇటీవల వీరిద్దరు కలిసి ఓ హోటల్‌లో డిన్నర్‌కు వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నట్లు అంతా ఫిక్స్ అయిపోయారు. అది చూసిన కొంతమంది నెటిజన్లు మాత్రం క్యూట్ జోడీ అని కామెంట్లు చేస్తున్నారు. శ్రీలీల అభిమానులు డేటింగ్ వార్తల్లో నిజం లేదు.. సినిమా కోసమే అలా చేస్తుందని అంటున్నారు. కాగా, కార్తీక్ ఆర్యన్, శ్రీలీల మధ్య 10 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉండటం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.






