Sreeleela: పీరియడ్స్‌లో ఉన్నప్పుడే అలాంటి పని చేశానంటున్న శ్రీలీల .. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |

ముఖ్యంగా మహిళలు సమాన హక్కుల గురించి మాట్లాడేటప్పుడు, ఇలాంటి శారీరక ఇబ్బందులను అడ్డంకులుగా లేదా సాకులుగా చూపించకూడదని ఆమె గట్టిగా నమ్ముతానని చెప్పింది.

Sreeleela: పీరియడ్స్‌లో ఉన్నప్పుడే అలాంటి పని చేశానంటున్న శ్రీలీల .. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: టాలీవుడ్ సెన్సేషనల్ డ్యాన్సర్, యంగ్ బ్యూటీ శ్రీలీల పీరియడ్స్ గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెను దుమారాన్ని రేపుతున్నాయి. తన డ్యాన్స్ మూమెంట్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసే ఈ భామ, వ్యక్తిగత ఇబ్బందుల కంటే వృత్తికే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పబోయి నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. తను నటించిన పాటలు సూపర్ హిట్ అవ్వడం వెనుక ఉన్న కష్టాన్ని వివరిస్తూ శ్రీలీల ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిన చాలా పాటల షూటింగ్ సమయాల్లో ఆమె పీరియడ్స్ (నెలసరి) లో ఉన్నానని, అయినా సరే ఎక్కడా తగ్గకుండా డ్యాన్స్ చేశానని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా మహిళలు సమాన హక్కుల గురించి మాట్లాడేటప్పుడు, ఇలాంటి శారీరక ఇబ్బందులను అడ్డంకులుగా లేదా సాకులుగా చూపించకూడదని ఆమె గట్టిగా నమ్ముతానని చెప్పింది.

మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు శారీరక, మానసిక సమస్యలు దేనికీ సాకులు కాకూడదని, తన వరకు తాను పీరియడ్స్ నొప్పిని లెక్కచేయకుండా వృత్తికే ప్రాధాన్యత ఇచ్చానని శ్రీలీల తన అభిప్రాయాన్ని బయటపెట్టింది. అయితే, ఈ మాటలే ఇప్పుడు వివాదానికి దారితీశాయి. శ్రీలీల తన డెడికేషన్ గురించి చెప్పినప్పటికీ, నెటిజన్లు మాత్రం ఆమెపై మండిపడుతున్నారు. ఒక్కొక్కరి శరీరం ఒక్కోలా ఉంటుందని, కొందరికి పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పి భరించలేనంతగా ఉంటుందని గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా PCOS లాంటి సమస్యలు ఉన్న మహిళలు పడే నరకం శ్రీలీలకు తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. ఆమెకు నొప్పి తక్కువగా ఉండి ఉండవచ్చని, అంత మాత్రాన నొప్పిని భరించే మిగతా మహిళల బాధను సాకు అని పిలవడం ఏంటని నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

Next Story