బాస్‌తో స్పెషల్ బ్రేక్ ఫాస్ట్.. దేవి శ్రీ ప్రసాద్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

by Disha Web Desk 6 |
బాస్‌తో స్పెషల్ బ్రేక్ ఫాస్ట్.. దేవి శ్రీ ప్రసాద్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. తాజాగా, దేవిశ్రీ ప్రసాద్ ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. డీఎస్పీ, మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఆయనతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపారు. ‘‘మధురమైన బ్రేక్‌ఫాస్ట్‌, అద్భుతమైన సమయం. మేం ఎప్పుడూ చాలా ప్రత్యేకంగా ఫీలయ్యేలా చేస్తుంటారు. అందుకే మీరంటే మాకు ఎప్పుడూ చాలా చాలా ప్రత్యేకం. లవ్‌ యూ సార్‌. ఇలాంటి అందమైన ఫొటో తీసిన సురేఖ గారికి ధన్యవాదాలు.. బాస్‌తో బ్రేక్‌ఫాస్ట్‌’’ అంటూ చిరంజీవితో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశాడు. దీంతో అది చూసిన నెటిజన్లు ఈ ఇద్దరు ఇలా కలుసుకోవడం వెనకున్న సీక్రెట్ ఏంటని చర్చించుకుంటున్నారు.

Read More: అనుష్కకి, భూమిక భర్తకు మధ్య ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా?

రాజమౌళికి కృతజ్ఞతలు తెలిపిన మణిరత్నం.. అదే కారణమట!



Next Story

Most Viewed