Los Angeles Times special article about RRR director SS Rajamouli

by Disha Web Desk 7 |
Los Angeles Times special article about RRR director SS Rajamouli
X

read దిశ, సినిమా : టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చారిత్రక చిత్రం 'ఆర్ఆర్ఆర్'. సుమారు రూ. 450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.1200 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ మేరకు ఇండియాలోనే కాక ఓవర్సీస్‌లోనూ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక మొన్నటి వరకు జక్కన్న జపాన్‏లో 'ఆర్‌ఆర్‌ఆర్' ప్రమోషన్స్‌లో సందడి చేసిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే, ప్రస్తుతానికి కొద్ది రోజులుగా అమెరికాలో సినిమాను ప్రమోట్ చేస్తూ ఫిలిం ఫెస్టివల్‏లో పాల్గొంటున్నందున జక్కన్నకు అక్కడ కూడా ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. దీంతో స్థానిక మీడియా, ప్రేక్షకులు ఆయన్ని కలిసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇదే క్రమంలో రీసెంట్‌గా మరో అరుదైన గౌరవం దక్కించుకున్నాడు రాజమౌళి. యూఎస్‌ఏలో లార్జెస్ట్ సర్క్యులేషన్ కలిగిన పేపర్స్‌లో ఒకటైన 'లాస్ ఏంజిల్స్ టైమ్స్'.. రాజమౌళిపై ఒక స్టోరీ పబ్లిష్ చేసింది. అది కూడా మొదటి పేజీలో పెద్ద పోస్టర్‌తో ప్రచురితం కావడం విశేషం.

LA Times special article about RRR director SS Rajamouli on Front పేజీ

READ MORE

ఆ సెలబ్రేషన్స్ ఆయనతోనే చేసుకోవాలనుంది : Lindsay Lohan

Next Story

Most Viewed