16 ఏళ్ల తర్వాత ప్రభాస్‌తో జతకట్టనున్న సౌత్ స్టార్ హీరోయిన్?

by Disha Web Desk 4 |
16 ఏళ్ల తర్వాత ప్రభాస్‌తో జతకట్టనున్న సౌత్ స్టార్ హీరోయిన్?
X

దిశ, వెబ్‌డెస్క్: వరుస పాన్ ఇండియా మూవీలతో దూసుకెళ్తున్నారు హీరో ప్రభాస్. సలార్, కల్కి, స్పిరిట్, రాజాడీలక్స్ వంటి సినిమాలను లైన్‌లో ఉంచిన ప్రభాస్ ‘కన్నప్ప’ మూవీలో శివుడి పాత్ర చేస్తున్నారనే వార్త ఊపందుకోగా మంచు విష్ణు ఈ వార్తను ట్విట్టర్ వేదికగా కన్ఫామ్ చేసిన విషయం తెలిసిందే. ఇక, ఇండస్ట్రీలో మరో వార్త హాట్ టాపిక్ గా మారింది. యోగి సినిమాలో ప్రభాస్ కు జంటగా నటించిన నయనతార ‘కన్నప్ప’ మూవీలో పార్వతి గా కనిపించనున్నారట. ఇక ఈ వార్త నిజమైతే దాదాపు 16 ఏళ్ల తర్వాత ఈ జంట మళ్లీ వెండితెరపై అలరించినట్లవుతుంది. అయితే నయనతార ఇటీవల బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్‌తో ‘జవాన్’ మూవీలో నటించి మంచి విజయం సొంతం చేసుకుంది. ఈ విషయంలో అధికారికంగా చిత్ర యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

Next Story

Most Viewed