Sonam Kapoor : రానాకు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన సోనమ్ కపూర్?

by Disha Web Desk 10 |
Sonam Kapoor : రానాకు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన సోనమ్ కపూర్?
X

దిశ, సినిమా: ఈ మధ్య ‘కింగ్ ఆఫ్ కోతా’ మూవీ ఈవెంట్లో సోనమ్ పేరు ఎత్తకపోయినా ఓ బాలీవుడ్ నటి అంటూ రానా విమర్శలు చేయడం వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. దీంతో మరో పోస్ట్‌లో రానా ఆమెకు క్షమాపణ కూడా చెప్పాడు. అయినప్పటికీ ఈ వివాదం ఇంకా పెరుగుతున్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే సోనమ్ రానా క్షమాపణలు అంగీకరించినట్లు లేదు. అతడే లక్ష్యంగా ఆమె మరో పోస్ట్ చేసినట్లు కనిపిస్తోంది. సోనమ్ లేటెస్ట్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ‌లో ‘బుర్ర తక్కువ వాళ్లు ఇతర వ్యక్తుల గురించి చర్చించుకుంటారు. కాస్త మెదడున్న వాళ్లు పనుల గురించి చర్చిస్తారు. గొప్ప మెదడు ఉన్నవాళ్లు ఆలోచనల గురించి చర్చిస్తారు’ అంటూ కొటేషన్‌ని పోస్ట్ చేసింది. దీంతో ఆ పోస్ట్ రానాను ఉద్దేశించి పెట్టిందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Read More: నేను అలా కనిపించడం రణ్‌బీర్‌కు నచ్చదు.. పెళ్లికిముందే రూల్స్ పెట్టాడు



Next Story

Most Viewed