- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కర్వా చౌత్ ఆయనకు ఇష్టముండదు.. అందుకే ఉపవాసం ఉండను..
బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ కర్వా చౌత్ కల్చర్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. Latest Telugu News

దిశ, సినిమా: బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ కర్వా చౌత్ కల్చర్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. నార్త్ ఇండియన్స్ ఎంతో పవిత్రంగా భావించే ఈ రోజును తాను పెద్దగా పట్టించుకోనని, ఉపవాసం కూడా ఉండనని చెప్పింది. ఎందుకంటే తన భర్త ఆనంద్ అహుజా ఇలాంటి పట్టింపులను పెద్దగా పరిగణలోకి తీసుకోడన్న ఆమె.. 'నా భర్త కర్వా చౌత్‌కి అభిమాని కాదు. ఉపవాసం కోసం ప్రత్యేక రోజు అవసరం లేదని భావిస్తాడు. కాబట్టి నేను ఎప్పుడూ ఫాస్టింగ్ సంప్రదాయాన్ని పాటించలేదు. కానీ, మా ఇద్దరికీ పండుగలు, సంప్రదాయాలంటే నమ్మకం, గౌరవం ఉంది. కుటుంబం, స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తాం. కొత్త దుస్తులు ధరించి మా అమ్మతో ఈ పండుగను జరుపుకోవడం నాకు చాలా ఇష్టం. అందరికీ కర్వా చౌత్ శుభాకాంక్షలు' అంటూ ఇన్‌స్టా వేదికగా స్పెషల్ నోట్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతుండగా.. రెడ్ కలర్ శారీలో సోనమ్ ఎంతో అందంగా కనిపించింది. ఇక ఈ జంట ఈ మధ్యే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.






