త్రిష-విజయ్ మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందండోయ్.. బర్త్ డే సందర్భంగా ప్రైవేట్ ఫొటోలు బయటపెట్టిన బ్యూటీ.. ఇక అంతా అఫిషియల్

by Sujitha Rachapalli |

బ్యూటిఫుల్ త్రిష - దళపతి విజయ్ జోడీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఆల్మోస్ట్ అన్ని సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్. అంత బాగుంటుంది వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ

త్రిష-విజయ్ మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందండోయ్.. బర్త్ డే సందర్భంగా ప్రైవేట్ ఫొటోలు బయటపెట్టిన బ్యూటీ.. ఇక అంతా అఫిషియల్
X

దిశ, వెబ్‌సైట్ : బ్యూటిఫుల్ త్రిష - దళపతి విజయ్ జోడీకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఆల్మోస్ట్ అన్ని సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్. అంత బాగుంటుంది వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ. అయితే రీల్‌లో మాత్రమే కాదు రియల్‌గా కూడా ఈ జంట మధ్య సంథింగ్ సంథింగ్ ఉందనే టాక్ నడుస్తోంది. గాసిప్స్ చాలవన్నట్లు చాలా సార్లు ఇద్దరు క్లోజ్‌గా ఉన్న ఫొటోస్ కూడా బయటకొచ్చాయి.

అయితే తాజాగా విజయ్ బర్త్ డే సందర్భంగా బ్యూటిఫుల్ పిక్స్ పోస్ట్ చేసింది త్రిష. ఈ బ్యూటీ పెంపుడు కుక్కను విజయ్ ఆడిస్తుండగా.. తన పక్కనే కూర్చుని ఉన్న పిక్‌ను పోస్ట్ చేస్తూ.. హ్యాపీ బర్త్ డే బెస్టెస్ట్ అని క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఫొటో చూసిన అభిమానులు బెస్ట్ ట్రీట్ ఇచ్చావని మురిసిపోతుంటే.. విమర్శకులు మాత్రం దారుణమైన ట్రోల్ చేస్తున్నారు. సంథింగ్ సంథింగ్ ఉందని ముందే అనుకున్నాం.. ఈ ప్రైవేట్ ఫొటోతో పూర్తిగా బయటపెట్టేశావ్.. అఫిషియల్‌గా మార్చేశావ్ అని కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఒక్క అమ్మాయి-అబ్బాయి మధ్య ప్యూర్ ఫ్రెండ్‌షిప్‌గా ఎందుకు చూడరని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.

PHOTOS

Next Story