- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొందరు రోడ్ మీదనే రెచ్చిపోతూ అలాంటి పనులు చేస్తున్నారు.. షాకింగ్ వీడియో షేర్ చేస్తూ నిర్మాత ఫైర్
టాలీవుడ్ నిర్మాత ఎస్ కె ఎన్(SKN) ‘బేబీ’(baby) సినిమా ద్వారా ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు.

దిశ, సినిమా: టాలీవుడ్ నిర్మాత ఎస్ కె ఎన్(SKN) ‘బేబీ’(baby) సినిమా ద్వారా ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు. ఆయన నిత్యం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ పలు వివాదాస్పద పోస్టులతో వార్తల్లో నిలుస్తుంటారు. ఆయన చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా మాత్రం ఫుల్ ఫేమ్ దక్కించుకున్నారు. తాజాగా, ఎప్ కెఎన్ ట్విట్టర్ ద్వారా షాకింగ్ వీడియోను షేర్ చేశారు. ‘‘మై హోం భుజా పక్క రోడ్డులో, నీలోఫర్ కేఫ్ రోడ్డులో, సత్వ బిల్డింగ్, ఇనార్బిట్ మాల్, హైటెక్ సిటీ ఏరియాల్లో ఎక్కువగా బైక్ రేసింగ్స్ అప్పుడప్పుడు కార్ రేసింగ్స్ జరుగుతున్నాయి.
వాళ్లు ఇలానే కంటిన్యూ చేస్తే అక్కడ రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరిగే ప్రమాదం ఉంది. అక్కడే రెండు పోలీస్ స్టేషన్లున్నాయి.. మాదాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, రాయదుర్గం పోలీస్ స్టేషన్‌ల పరిధిలోనే ఇదంతా ఉంటుంది.. ఇలాంటి వాటిని వెంటనే కట్టడి చేసి పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ కాకుండా, రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి.. వాటి వల్ల విపరీతమైన శబ్ద కాలుష్యం కూడా ఏర్పడుతూ ఉంటుంది’’ అని రాసుకొచ్చారు. అంతేకాకుండా యాక్సిడెంట్ వీడియోను కూడా షేర్ చేశారు. ఇక అది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.






