అభిమానులకు శివకార్తికేయన్ కీలక విజ్ఞప్తి.. సోషల్ మీడియా వాడకంపై ఆసక్తికర కామెంట్స్

by Mallepaka Hamsa |

కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ (Sivakarthikeyan)చెన్నైలో నిర్వహించిన ఓ ఎంటర్‌టైన్‌మెంట్ యాప్ లాంచింగ్ ఈవెంట్‌కు వెళ్లారు.

అభిమానులకు శివకార్తికేయన్ కీలక విజ్ఞప్తి.. సోషల్ మీడియా వాడకంపై ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ (Sivakarthikeyan)చెన్నైలో నిర్వహించిన ఓ ఎంటర్‌టైన్‌మెంట్ యాప్ లాంచింగ్ ఈవెంట్‌కు వెళ్లారు. ఇందులో ఆయన సోషల్ మీడియాలో వాడకంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సరైన రీతిలో ఉపయోగించుకుని, కెరీర్‌లో ముందుకెళ్లాలి కానీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అభిమాన హీరో తనను కాకుండా తల్లిదండ్రులను ఆధారించాలని సూచించారు. ఈ ఈవెంట్‌లో శివకార్తికేయన్ మాట్లాడుతూ.. యూత్ సోషల్ మీడియాకు అతుక్కుపోయి మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దని అన్నారు. అలాగే కెరీర్‌పై దృష్టి పెట్టి మంచి పొజిషన్‌లో ఉండాలని తెలిపారు.

తనకు అన్ని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో అకౌంట్స్ ఉన్నప్పటికీ.. ఆయా యాప్స్‌లో ఎప్పుడు ఏం చర్చ జరుగుతుంటుందో తనకు తెలియదని చెప్పారు. అలాగే యూత్ కూడా అవసరం అయిన విషయాలకు వాడుకుని మిగిలిన విషయాలు పట్టించుకోవద్దని సలహా ఇచ్చారు. అలాగే తనను అభిమానించే బదులు మీ తల్లిదండ్రులను ఆరాధించండి అని పేర్కొన్నారు. కాగా.. శివకార్తికేయన్ సినిమాల విషయానికొస్తే.. తన కెరీర్‌లో 25వ చిత్రంగా రాబోతున్న ‘పరాశక్తి’ (Parashakti)చేస్తున్నాడు. పొలిటికల్ డ్రామాగా రాబోతుండగా.. సుధా కొంగర (Sudha Kongara)దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో శివ కార్తికేయన్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా.. రవి మోహన్, అథర్వ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

Next Story