భారీ బడ్జెట్ మూవీతో రాబోతున్న శివకార్తికేయన్.. కలిసొచ్చేనా?

by Mallepaka Hamsa |

కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్(Siva Karthikeyan) బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతున్నారు.

భారీ బడ్జెట్ మూవీతో రాబోతున్న శివకార్తికేయన్.. కలిసొచ్చేనా?
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్(Siva Karthikeyan) బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఇక గత ఏడాది ‘అయలాన్’, మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం సంఘటలనతో తెరకెక్కిన ‘అమరన్’(Amaran)వంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించడంతో పాటు విజయం సాధించాడు. ప్రస్తుతం శివ కార్తికేయన్ కెరీర్‌లో 25వ రాబోతున్న ‘పరాశక్తి’Parashakti) షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది.

దీంతో పాటు ఆయన ‘sk-24’ సినిమాలోనూ నటిస్తున్నారు. అయితే శిబి చక్రవర్తి (Cibi Chakaravarthi)దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ బ్యూటీ రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఎస్ జే సూర్య విలన్ పాత్రలో కనిపించనున్నాడు. పాషన్ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘బాస్’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాక్. తాజాగా, ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. భారీ బడ్జెట్‌తో రాబోతున్న SK-24 ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయినట్లు టాక్. షూటింగ్ ఈ ఏడాది చివరలో మొదలుపెట్టుబోతున్నారట.

Next Story