- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మదరాసి’ ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన శివకార్తికేయన్.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్(Siva Karthikeyan) వరుస హిట్స్ సాధిస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్(Siva Karthikeyan) వరుస హిట్స్ సాధిస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. గత ఏడాది అయలాన్, అమరన్ వంటి చిత్రాలతో ఘన విజయం అందుకున్న ఈయన బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం శివ కార్తికేయన్ ‘మదరాసి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఎ ఆర్ మురుగదాస్(A.R. Murugadoss) దర్శకత్వంలో తెరకెక్కుతోంది. శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం విజువల్ వండర్‌గా అద్భుతంగా రూపొందుతోంది. ఇందులో శివ కార్తికేయన్ సరసన రుక్మిణి వసంత్(Rukmini Vasant) హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఇందులో బిజు మీనన్, షబీర్, విక్రాంత్, విద్యుత్ జామ్వాల్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
దీనికి అనురుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం సెప్టెంబర్ 5న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. దీంతో అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మూవీ మేకర్స్ అప్డేట్స్ విడుదల చేస్తున్నారు. తాజాగా, శివ కార్తికేయన్ ‘మదరాసి’ మ్యూజికల్ జర్నీ స్టార్ట్ అయినట్లు ప్రకటించాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ ‘సిలంబల’ ప్రోమో రిలీజ్ చేస్తూ.. ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేశారు.
అంతేకాకుండా పూర్తి పాట జులై 31న సాయంత్రం 6గంటలకు విడుదల కాబోతున్నట్లు వెల్లడించాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆనంద పడుతున్నారు. కాగా, ఈ చిత్రంతో పాటు శివకార్తికేయన్ ‘పరాశక్తి’ కూడా చేస్తున్నారు. ఈ మూవీ ఆయన కెరీర్‌లో 25వ ప్రాజెక్ట్‌గా రాబోతుంది. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా.. జయం రవి అథర్వ మురళి కీలక పాత్రలో కనిపించనున్నారు. దీనికి సుధా కొంగర దర్శకత్వం వహిస్తోంది.






