- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయ్‌కు పోటీగా శివ కార్తికేయన్ సినిమా.. స్పందించి క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ సుధా కొంగర (వీడియో)
కోలీవుడ్ హీరో దళపతి విజయ్(Thalapathi Vijay) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జన నాయగన్’(Jana Nayagan).

దిశ, సినిమా: కోలీవుడ్ హీరో దళపతి విజయ్(Thalapathi Vijay) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జన నాయగన్’(Jana Nayagan). హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తుండగా.. తమిళ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 9న థియేటర్స్‌లోకి రాబోతుంది. అయితే ఈ మూవీ కి పోటీగా శివ కార్తికేయన్ ‘పరాశక్తి’(Parashakti) రాబోతున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. సూధా కొంగర దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. శివకార్తికేయన్ 25వ సినిమాగా రాబోతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇదిలా ఉంటే.. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధా కొంగర పరాశక్తి, జననాయగన్ పోటీపడబోతున్నాయంటూ వస్తున్న వార్తలపై స్పందించారు. ‘‘రెండు సినిమాలు సంక్రాంతికి పోటీపడనున్నట్లు గత కొద్ది రోజుల నుంచి వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ వాటిల్లో ఎలాంటి నిజం లేదు. నాకు వాటి గురించి తెలియదు. పరాశక్తి ఎప్పుడు విడుదల కావాలనేది నిర్మాతలు మాత్రమే నిర్ణయిస్తారు. అందులో నా ప్రమేయం ఉండదు. శివకార్తికేయన్‌ను ఈ మూవీలో హీరోగా ఎంపిక చేసుకోవడానికి ఓ కారణముంది. ఆయన పక్కింటి అబ్బాయిలా కనిపిస్తాడు. ఈ లక్షణాలు ఉన్న వ్యక్తి కథలో హీరో పాత్రకు సరిగ్గా సరిపోతాడని తీసుకున్నాము. రవి మోహన్(Ravi Mohan) గొప్ప నటుడు. ఆయన నిజ జీవిత స్వభావం ఇందులో విలన్ పాత్రకు భిన్నంగా ఉన్నప్పటికీ అతడినే ఎంపిక చేశాను’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






