యూట్యూబ్‌లోకి ‘సితారే జమీన్ పర్’ సినిమా.. క్షమాపణలు కోరుతూ ఆమిర్ ఖాన్ ట్వీట్

by Mallepaka Hamsa |

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్(Aamir Khan) నటించిన లేటెస్ట్ చిత్రం ‘సితారే జమీన్ పర్’(Sitare Zameen Par).

యూట్యూబ్‌లోకి ‘సితారే జమీన్ పర్’ సినిమా.. క్షమాపణలు కోరుతూ ఆమిర్ ఖాన్ ట్వీట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్(Aamir Khan) నటించిన లేటెస్ట్ చిత్రం ‘సితారే జమీన్ పర్’(Sitare Zameen Par). కామెడీ అండ్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రానికి ఆర్.ఎస్ ప్రసన్న కుమార్ దర్శకత్వం వహించాడు. ‘తారే జమీన్’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చింది. ఈ మూవీని ఆమిర్ ఖాన్, అపర్ణ పురోహిత్(Aparna Purohit) నిర్మించారు. జూన్ 20న వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. దీంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం నెటిజన్లు ఈగర్‌గా వెయిట్ చేస్తుండగా.. ఓటీటీలో కాకుండా డైరెక్ట్ యూట్యూబ్‌లోకి రిలీజ్ చేసేందుకు సిద్ధం అయ్యాడట ఆమిర్. అంతే కాకుండా యూట్యూబ్‌లో పే-పర్-వ్యూ (రూ.100) మోడల్‌లో ఆగస్టు 1వ తేదీ నుంచి రాబోతుంది.

‘సితారే జమీన్ పర్’ సినిమాకు రూ. 179 చూపిస్తుండటంతోపలువురు ఫిర్యాదులు చేస్తు్న్నారు. ఈక్రమంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘‘సితారే జమీన్ పర్ చిత్రం యాపిల్ డివైస్లలో అద్దె ఎక్కువగా చూపిస్తోందని మా దృష్టికి వచ్చింది. ఈ విషయంలో మేము అందరినీ క్షమాపణలు కోరుతున్నాము. ఈ సమస్యను పరిష్కరించడానికి అందరం కృషి చేస్తున్నాం. సాధ్యమైనంత త్వరలో దీనిని పరిష్కరిస్తాము. అర్థం చేసుకొని మాకు సహకరిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

link

Next Story