- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సితారకు తప్పని తిప్పలు.. చర్చనీయాంశంగా మారిన స్టార్ కిడ్ పోస్ట్.. అసలేం జరిగిందంటే?
గత కొద్ది కాలంగా సినీ సెలబ్రిటీలు పేరుతో సోషల్ మీడియాలో పలు అకౌంట్లు క్రీయేట్ చేస్తున్న విషయం తెలిసిందే.

దిశ, సినిమా: గత కొద్ది కాలంగా సినీ సెలబ్రిటీలు పేరుతో సోషల్ మీడియాలో పలు అకౌంట్లు క్రీయేట్ చేస్తున్న విషయం తెలిసిందే. దాని ద్వారా పలువురు కేటుగాళ్లు జనాలను మోసం చేస్తు్న్నారు. సినీ సెలబ్రిటీలు ఫేక్ అకౌంట్ల బారిన పడుతుంటారు. అలా ఇప్పటికే ఎంతోమంది సినీ స్టార్స్ ఇలాంటి విషయాలపై సోషల్ మీడియా ద్వారా స్పందించి క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా, సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) కూతురికి కూడా అలాంటి అనుభవమే ఎదురైంది. దీనిపై క్లారిటీ ఇస్తూ సితార ఘట్టమనేని(Sitara Ghattamaneni) ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ కూడా పెట్టింది. ‘‘నా పేరు మీద పలు ఫేక్ అకౌంట్స్ ఉన్నట్లు నా దృష్టికి వచ్చింది. ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరికీ చెబుతున్నాను.. నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రమే అకౌంట్ ఉంది. ఇదే నా అఫీషియల్. ఏదైనా చెప్పాలనుకుంటే నేను దీని ద్వారానే చెబుతాను. వేరే ఏ సోషల్ మీడియాలోనూ నాకు ఖాతా లేదు.
కాబట్టి నా పేరు మీద అకౌంట్స్ మెయింటేన్ చేస్తున్న వారితో జాగ్రత్తగా ఉండండి. దయచేసి అలాంటి అకౌంట్స్ నమ్మొద్దు మెసేజ్ చేయొద్దు’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం సితార పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు సితారకు కూడా ఫేక్ అకౌంట్స్ వల్ల సమస్యలు వచ్చాయి కావచ్చు.. అందుకే సడెన్‌గా ఇలాంటి పోస్ట్ పెట్టిందని చర్చించుకుంటున్నారు. కాగా, సితార సినిమా ఇండస్ట్రీకి రానప్పటికీ ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఓ యాడ్ చేసిన ఆమె స్టార్ హీరోయిన్ అంత క్రేజ్‌ను రాబట్టుకుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ఫొటోలు షేర్ చేస్తూ ఉంటుంది. అలాగే నెట్టింట తన ఫాలోవర్స్‌ను పెంచుకునే ప్రయత్నాలు చేస్తుంటుంది. అంతేకాకుండా తనవంతుగా పేద పిల్లలు సాయం కూడా చేస్తూ ప్రశంసలు పొందుతుంటుంది.






