- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్.. ‘జటాధర’ నుంచి సితార పోస్టర్ రిలీజ్ చేసి క్యూరియాసిటీ పెంచేసిన మూవీ మేకర్స్
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు(Sudheer Babu), వెంకట్ కళ్యాణ్(Venkat Kalyan) కాంబోలో రాబోతున్న చిత్రం ‘జటాధర’.

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో సుధీర్ బాబు(Sudheer Babu), వెంకట్ కళ్యాణ్(Venkat Kalyan) కాంబోలో రాబోతున్న చిత్రం ‘జటాధర’. సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీగా రాబోతుండగా.. ప్రేరణా అరోరా, జీ స్టూడియోస్ బ్యానర్‌పై ఉమేష్ కుమార్, శివిన్ నారంగ్, అరుణ్ అగర్వాల్, నిఖిల్ నందా ఇండియన్ సినిమాల్లో ఓ బెంచ్ మార్క్‌కు క్రియేట్ చేసేలా రూపొందిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా హీరోయిన్‌గా నటిస్తోంది. డివోషనల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ వస్తున్నాయి. తాజాగా, ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుపుతూ చిత్రబృందం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇందులో యంగ్ బ్యూటీ దివ్య ఖోస్లా కుమార్(Divya Khosla Kumar) ‘సితార’ పాత్రలో నటిస్తోంది. ఇక విడుదలైన పోస్టర్‌లో లంగా ఓణిలో గార్జియస్ లుక్‌లో కనిపించి అందరినీ మెస్మరైజ్ చేసింది. ఇందులో ‘‘శిథిలావస్థలో.. సితార విశ్వాసాన్ని కనుకొంది’’ అని పోస్టర్ రాసి ఉండటం సినీ ప్రియుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. అయితే దివ్యా ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది.






