ధోతిలో అదిరిపోయిన సితార.. తండ్రీ పాటకు దుమ్మురేపే స్టెప్స్ వేస్తూ..(వీడియో)

by Disha Web Desk 8 |
ధోతిలో అదిరిపోయిన సితార.. తండ్రీ పాటకు దుమ్మురేపే స్టెప్స్  వేస్తూ..(వీడియో)
X

దిశ, సినిమా : సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సోషల్ మీడియాలో తన ఫొటోస్, డ్యాన్స్ వీడియోస్ పోస్ట్ చేస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

ఇక తాజాగా మహేష్ బాబు గుంటూరు కారం మూవీ విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సితార ఘట్టమనేని గుంటూరు కారం సినిమాలోని దమ్ మసాలా అనే పాటకు స్టైలిష్ డ్రెస్‌లో తండ్రిలా మాస్ స్టెప్స్ వేస్తూ అందరినీ ఆకట్టుకుంది. ఇక ఈ వీడియోను సితార తన ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. డాడీ ఇది నీకోసమే అంటూ క్యాప్షన్ ఇచ్చింది.ఇక ఎరుపు రంగు సాంప్రదాయ ధోతి, తెల్లరంగు బూట్ల, తెల్లటి క్రాప్ టాప్‌‌లో ఆమే వేసిన డ్యాన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.


ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు కారం` సినిమాలో శ్రీలీల హీరోయిన్‌‌గా నటించి మంచి మార్కులు కొట్టేసింది. మూవీలో ఈ నటి మాస్ స్టెప్స్‌తో అదరగొట్టింది. అయితే తాజాగా సితార చేసిన డాన్సు శ్రీలీలని తలపిస్తుందని, ఇంకా చెప్పాలంటే శ్రీలీలని మించిపోతుందని, ఇప్పుడు ఇలా ఉంటే ఒకవేళ హీరోయిన్‌ అయితే డాన్సుల్లో శ్రీలీల కూడా దిగదుడుపే అంటున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్. ఇక సితారని బీట్‌ చేయడం కష్టమేఅంటున్నారు


Next Story