కీలక మెసేజ్‌తో వచ్చిన ‘సార్.. మేడమ్’ మూవీ ట్రైలర్.. సినీ ప్రియులు ఫిదా

by Mallepaka Hamsa |   (  Updated:2025-07-17 15:13:25  IST  )

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి(Vijay Sethupathi) తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాల్లో నటిస్తున్నారు.

కీలక మెసేజ్‌తో వచ్చిన ‘సార్.. మేడమ్’ మూవీ ట్రైలర్.. సినీ ప్రియులు ఫిదా
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి(Vijay Sethupathi) తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాల్లో నటిస్తున్నారు. తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. ఈ చిత్రంతో పాటు విజయ్ సేతుపతి, పాండిరాజ్(Pandiraj) దర్శకత్వంలో ‘తలైవాన్.. తలైవి’ మూవీ చేస్తున్నారు. ఇక ఇందులో నిత్యామీనన్(Nithya Menon) హీరోయిన్‌గా నటిస్తోంది. రగ్గడ్ వల్ స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ చిత్రాన్ని సత్యజ్యోతి, త్యాగరాజన్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్, గ్లింప్స్ అన్ని ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ మూవీ తెలుగులో ‘సార్.. మేడమ్’ పేరుతో రాబోతుంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ‘తలైవాన్.. తలైవి’ చిత్రం జులై 25న థియేటర్స్‌లోకి రాబోతుంది.

దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్రబృందం వరుస అప్డేట్స్ ఇస్తూ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతున్నారు. తాజాగా, చిత్రబృందం ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో భార్యాభర్తలుగా నటించిన విజయ్ సేతుపతి, నిత్యామీనన్ ఓ హోటల్ నడిపిస్తూ జీవనం కొనసాగిస్తుంటారు. వీరికి ఓ కూతురు కూడా ఉంటుంది. అంతా బాగానే ఉందనుకునే సమయంలో వీరిద్దరి మధ్య విపరీతంగా గొడవలు వస్తాయి. ప్రతి విషయంలోనూ చిరుబురులాడుకుంటారు. ఈక్రమంలోనే మూడు నెలల పాటు దూరంగా ఉంటారు. కొద్ది రోజులకు కలుసుకున్న ఈ జంట మళ్లీ గొడవ పడతారు. భార్య భర్తలు ఎంత కొట్టుకున్నా.. తిట్టుకున్నా విడాకులు తీసుకోవద్దనే కాన్సెప్ట్‌తో వచ్చిన ‘సార్.. మేడమ్’ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక ఇది చూసిన నెటిజన్లు సూపర్ ఉందని కామెంట్లు చేస్తున్నారు. గత కొద్ది కాలంగా సినీ సెలబ్రిటీలతో పాటు సాధారణ జనాలు చిన్న చిన్న కారణాలతో విడాకులు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈక్రమంలోనే ఈ ట్రైలర్ రిలీజ్ చేసి అందరినీ ఫిదా అయ్యేలా చేశారు.

Next Story