Siri Hanmanth: నా సర్వం అతడే అంటున్న బిగ్ బాస్ ఫేమ్ సిరి

by Sathputhe Rajesh |   (  Updated:2022-04-07 13:46:34  IST  )

దిశ, సినిమా: బిగ్‌బాస్ సీజన్ 5 ను చూసిన అభిమానులకు సిరిహన్మంత్ అలియాస్ శిరిష తెలియకుండా ఉండదు. బిగ్‌బాస్ సీజన్ జరిగినన్ని రోజు

Siri Hanmanth: నా సర్వం అతడే అంటున్న బిగ్ బాస్ ఫేమ్ సిరి
X

దిశ, సినిమా: బిగ్‌బాస్ సీజన్ 5 ను చూసిన అభిమానులకు సిరిహన్మంత్ అలియాస్ శిరిష తెలియకుండా ఉండదు. బిగ్‌బాస్ సీజన్ జరిగినన్ని రోజులు సిరి, షన్ముఖ్ ల పేర్లు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగాయి. సిరి, షన్ముఖ్ లకి బిగ్ బాస్ లోకి వెళ్లక మొందే మంచి పరిచయం ఉంది.సిరికి శ్రీహన్ తో పెళ్లి కూడా నిశ్చయం అయింది.బిగ్ బాస్ నుండి తిరిగి రాగానే పెళ్లి చేసుకుంటాం అంటూ చెప్పుకొచ్చింది. ఇక షన్ముఖ్ కూడా దీప్తి సునైనా తో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు. బిగ్ బాస్ లో ఉన్నన్ని రోజులు షన్ముఖ్ కి మంచి సపోర్ట్ ఇచ్చి టాప్ 2 లో నిలిచేలా చేసింది. కానీ సిరి, షన్ముఖ్ ల ప్రవర్తన నచ్చని అభిమానులు వీరి పై దారుణంగా ట్రోల్స్, నెగటివ్ కామెంట్లు చేశారు.దీంతో విన్నర్ అవ్వాల్సిన షన్ముఖ్ రన్నరప్ తో సరిపెట్టుకున్నాడు.బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన షన్ముఖ్,సిరి లకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి.షన్ముఖ్ వల్ల నెగిటివిటి ని ఎదుర్కొన్న దీప్తి బ్రేకప్ చెప్పి షన్నూ కి దూరం అయింది. అదేవిధంగా సిరి పై వచ్చిన నెగటివ్ ట్రోల్స్ కి శ్రీహన్,సిరి కి దూరంగా ఉంటున్నాడని, దీప్తి దారిలో నడుస్తూ బ్రేకప్ చెప్పే అవకాశాలున్నాయని సోషల్ మీడియాలో చక్కర్లుకొట్టాయి.వీటన్నింటికి చెక్ పెట్టేందుకు సిరి,శ్రీహన్ తో దిగిన ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ

'ప్రతి క్షణం(మంచి-చెడు సమయాల్లో) నా పక్కనే నిలిచే వ్యక్తి. మంచి మనసున్న వ్యక్తి. నా బలం, నా మార్గదర్శి, నా గార్డియన్‌, నా సర్వస్వం. అతడే ఇతను. 'మై వన్‌ అండ్‌ ఓన్లీ శ్రీహాన్‌' అంటూ సిరి పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్ మీడియా లో హాట్‌టాపిక్‌గా మారింది. వీరిద్దరిని ఒక్కటిగా చూసిన ఫ్యాన్స్‌ తెగ మురిసిపోతున్నారు. ఈ పోస్ట్‌తో వారి మధ్య మనస్పర్థలు తొలిగిపోయాయని సిరి చెప్పకనే చెప్పిందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Next Story