ఆసక్తిరేకెత్తిస్తున్న ధనుష్ 'సార్' మూవీ ట్రైలర్..!

by Disha Web Desk 13 |
ఆసక్తిరేకెత్తిస్తున్న ధనుష్ సార్ మూవీ ట్రైలర్..!
X

దిశ, వెబ్‌డెస్క్: త‌మిళ హీరో ధ‌నుష్‌కు తెలుగులోనూ మంచి మార్కెట్‌ ఉంది. 'ర‌ఘువ‌ర‌న్ B-Tech', మారి, తిరు వంటి సినిమాలు ధ‌నుష్‌కు టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఈ క్రమంలోనే తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో చేతులు కలిపి 'సార్‌' సినిమా చేశాడు. ద్విభాష చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ మూవీ మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న రిలీజ్‌ కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్‌డేట్‌లు ప్రకటిస్తూ సినిమాపై ఆసక్తి పెంచుతున్నారు. కాగా తాజాగా చిత్రబృందం ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేసింది. లేటెస్ట్‌గా రిలీజైన ట్రయిలర్‌ ఆసక్తి రేకెత్తిస్తుంది.

ధనుష్‌ యాక్షన్‌తో అదరగొడుతున్నాడు. సంయుక్త మీనన్‌తో లవ్‌ ట్రాక్‌ బాగుంది. సముద్రఖని మరోసారి తన విలనిజంతో ఆకట్టుక్కోడానికి సిద్ధమయ్యాడు. ముఖ్యంగా జీవి. ప్రకాష్‌ కుమార్‌ నేపథ్య సంగీతం గూస్‌బంప్స్‌ తెప్పిస్తుంది. యాక్షన్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో ధ‌నుష్‌కు జోడీగా సంయుక్త మీన‌న్ హీరోయిన్‌గా న‌టించింది. జీవి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. ఇప్పటికే రిలీజైన 'మాస్టారు మాస్టారు', 'బంజార' పాటలకు విశేష స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్టైన‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Next Story

Most Viewed